Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్3: అసలైన విజేత ఆయనే.. హిమజ, హేమని పట్టించుకోను: శ్రీముఖి

దాదాపు 100 రోజుల పాటు తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3 నవంబర్ 3న ముగిసింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ షోలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. శ్రీముఖి రన్నర్ గా నిలిచింది.

Sreemukhi interesting comments on baba bhaskar
Author
Hyderabad, First Published Nov 11, 2019, 12:41 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్ బాస్ 3 ముగిసిన తర్వాత శ్రీముఖి తొలిసారి సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా శ్రీముఖి పలు విషయాలు తెలిపింది. బిగ్ బాస్ లో రన్నరప్ తో సరిపెట్టుకోవడంపై తనకు ఎలాంటి నిరాశ లేదని తెలిపింది. జీవితంలో ఇంకా ఏదో సాధించాలి.. నన్ను నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అని అనిపించిందని శ్రీముఖి తెలిపింది. 

Bigg Boss 3: షోపై జాఫర్ సంచలన కామెంట్స్.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

తన అభిప్రాయం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 3లో అసలైన విజేత బాబా భాస్కర్ మాత్రమే అని శ్రీముఖి ఆసక్తికర కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ హౌస్ లో బాబా భాస్కర్ లేని చోటు అంటూ లేదు. ఆయన టాస్కుల్లో, వంటల్లో, ఎంటర్టైన్మెంట్ అన్ని విభాగాల్లో రాణించారు. 

తనకు బాబా భాస్కర్ తర్వాత అంతగా నచ్చిన వ్యక్తి తమన్నా సింహాద్రి అని శ్రీముఖి తెలిపింది. రాహుల్ నాకు మంచి ఫ్రెండ్. కాన పరిస్థితుల వల్ల మాత్రమే మా మధ్య గొడవలు జరిగాయి అని శ్రీముఖి తెలిపింది. 

బిగ్ బాస్ నాకిచ్చింది చాలా తక్కువ.. రెమ్యునరేషన్ పై రాహుల్ కామెంట్స్!

హేమ, హిమజ హౌస్ లో ఉన్నన్ని రోజులు నాతో బాగానే ఉన్నారు. కానీ బయటకు వెళ్ళాక నా గురించి నెగిటివ్ గా కామెంట్స్ చేశారు. వాళ్ళు అలా ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు. కాబట్టి వారి కామెంట్స్ కు నేను స్పందించను అని శ్రీముఖి తెలిపింది. బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ కాదని మరోమారు స్పష్టం చేసింది. 

బిగ్ బాస్ విన్నర్ విషయంలో శ్రీముఖి, బాబా భాస్కర్, రాహుల్, వరుణ్ పై ఎక్కువగా అంచనాలు ఉండేవి. కానీ చివరకు రాహుల్ టైటిల్ ఎగరేసుకు పోయాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు బాబా భాస్కర్ శ్రీముఖికి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. బయటకు వచ్చాక కూడా శ్రీముఖి విజేతగ్గా నిలిచి ఉంటే బావుండేదని బాబా భాస్కర్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios