బ్రహ్మోత్సవం సినిమాతో ఊహించని డిజాస్టర్ అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఇంకా ఆ దెబ్బ నుంచి కోలుకోలేనట్లు అర్ధమవుతోంది. కెరీర్ మొదట్లో కొత్త బంగారు లోకం - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి మంచి సినిమాలను తెరకెక్కించిన శ్రీకాంత్ ఆ తరువాత ముకుంద సినిమా చేశాడు. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.  అయినప్పటికీ మహేష్ బాబు శ్రీకాంత్ పై నమ్మకంతో బ్రహ్మోత్సవం సినిమా ద్వారా అవకాశం ఇచ్చాడు.

ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమాతో మహేష్ బాబులో కూడా చాలా మార్పు వచ్చింది. దర్శకుడిని నమ్మి బ్లైండ్ గా వెళ్లిపోవడం తగ్గించేశారు. బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే సెట్స్ పైకి సినిమాను తీసుకెళుతున్నాడు. ఇక ఆ సినిమా ప్లాప్ వల్ల శ్రీకాంత్ కి అవకాశాలు చాలా వరకు తగ్గాయి.  గీతా ఆర్ట్స్ బ్యానర్ ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సినిమాను స్టార్ట్ చేయలేక సతమతమవుతున్నాడు.

కొత్త సినిమా కోసం చాలా మంచి హీరోలను సంప్రదించాడు,. కానీ ఎవరు కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. మొదట శర్వానంద్ నుంచి నాని - వెంకటేష్ ఇలా చాలా మంది హీరోలకు కథను చెప్పిన శ్రీకాంత్ వారిని మెప్పించలేకపోయాడట. ఇక ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది.  ముకుంద సినిమా ద్వారా వరుణ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు వరుణ్ మరో అవకాశం ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ గీతా ఆర్ట్స్ GA2 ప్రొడక్షన్స్ చిన్న బడ్జెట్ లో సినిమాను నిర్మించాలని అనుకుంటోంది. బంధువే అయినా వరుణ్ తేజ్ మార్కెట్ కి తగ్గ రెమ్యునరేషన్ ఇస్తారా లేదా అన్నది సందేహమే.  వరుణ్ మార్కెట్ దృష్ట్యా బడ్జెట్ ని అలాగే స్టార్ క్యాస్ట్ లో మార్పులు అవసరం. దీంతో శ్రీకాంత్ ప్రాజెక్ట్ లో వరుణ్ నటిస్తాడా లేదా అన్నది ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే శ్రీకాంత్ అడ్డాల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.