ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం లాక్ డౌన్ సందర్భంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మెగా ఫ్యామిలీ సెలెబ్రిటీలంతా సోషల్ మీడియాలో  చేరువగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల చిరంజీవి ట్విట్టర్ ఖాతాని ప్రారంభించారు. రాంచరణ్ కూడా ట్విట్టర్ లోకి వచ్చేసాడు. 

తాజాగా చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ఇన్స్టాగ్రామ్ లో తన భర్తతో ఉన్న రొమాంటిక్ పిక్ ని షేర్ చేసింది. శ్రీజ, కళ్యాణ్ దేవ్ 2016లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ జంటకు ఓ పాప కూడా ఉంది. 

ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ టాలీవుడ్ హీరోగా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన తొలి ప్రయత్నం విజేత చిత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి అనే చిత్రంలో నటిస్తున్నాడు. 

శ్రీజ కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్. తరచుగా తన భర్తతో ఉన్న ఫోటోలని శ్రీజ షేర్ చేస్తూ ఉంటుంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

👩‍❤️‍👨 #couplegoals . @kalyaan_dhev

A post shared by Sreeja Kanuganti (@sreeja_kalyan) on Apr 26, 2020 at 3:02am PDT