Asianet News TeluguAsianet News Telugu

#Alluri:షాక్... 'అల్లూరి' ఈ రోజు నుంచే OTT లో ....

యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా మూవీ ‘అల్లూరి’ ఇటీవల రిలీజ్ అయ్యిది. ఈ సినిమాతో తొలిసారి పోలీస్ పాత్రలో శ్రీవిష్ణు నటించడంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. 

Sree Vishnu Alluri to arrive on this OTT today
Author
First Published Oct 7, 2022, 1:26 PM IST

 


కెరీర్ ప్రారంభం నుంచి  శ్రీవిష్ణు విభిన్నమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'అల్లూరి' వచ్చింది. క్రిందటి  నెల 23వ తేదీన ఈ సినిమా థియేటర్లలో దిగింది. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించాడు.  ఈ చిత్రంపై శ్రీవిష్ణు చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే ఆ నమ్మకం వమ్మైంది. సినిమా డిజాస్టర్ అయ్యింది.

, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుండగానే, ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ సొంతం చేసుకుంది.  దీంతో ఈ సినిమాను ఈ రోజు నుంచే  ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారని ఆహా వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో శ్రీవిష్ణు సరికొత్త లుక్‌లో కనిపించగా, ఆయన సరసన అందాల భామ కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ప్రొడ్యూస్ చేయగా, హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.

చిత్రం కథేమిటంటే....నాజీరుద్దీన్ (తనికెళ్ళ భరణి) కొడుకైన ఇక్బాల్ పోలీస్ ఆఫీసర్ కావాలనే కోరికతో ఎన్నో ఏళ్ళ పాటు ఎంతో ప్రయత్నం చేసి చివరకు కాలేకపోవడంతో ఇతర ఉద్యోగం చేస్తుంటాడు. అయితే గతంలో ఎస్సై సీతారామరాజు తో కలిసి పని చేసిన తన అనుభవాన్ని, అతడి స్ఫూర్తిదాయకమైన జీవిత కథని వివరిస్తాడు అతని తండ్రి నజీరుద్దీన్. కాగా మిగతా సినిమా మొత్తం పోలీస్ అధికారి అల్లూరి సీతారామరాజు జీవితం, అతడు తన లైఫ్ లో ప్రొఫెషన్ లో ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు అనేవి చూపించడంతో సినిమా సాగుతుంది.
 
  శ్రీవిష్ణు  మాట్లాడుతూ .. "ఈ సినిమాకి ముందు చేసిన రెండు సినిమాల్లోను దొంగ పాత్రనే చేశాను. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చేయడం కొత్తగా అనిపించింది.  పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథలు గతంలో చాలానే వచ్చాయి. కానీ ఈ సినిమా ఒక పోలీస్ ఆఫీసర్ బయోపిక్. ఈ కథ వినగానే నేను ఈ సినిమాను ఒప్పుకోవడానికి కారణం ఇదే. కొత్తదనమున్న కథలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ సినిమాలోని ఈ పాత్ర కోసం నేను బరువు తగ్గడం .. పెరగడం చేశాను. ఆడియన్స్ పెట్టే డబ్బుకి రెట్టింపు వినోదాన్ని ఈ సినిమా ఇస్తుందని నేను నమ్మకంగా చెప్పగలను" అంటూ సమాధానమిచ్చాడు.

'బ్రోచేవారెవరురా' తరువాత శ్రీ విష్ణు ఇక దూకుడు చూపిస్తాడని అనుకుంటే, 'తిప్పరా మీసం' .. 'గాలి సంపత్' సినిమాలు పరాజయాలను అందుకున్నాయి. ఆ తరువాత 'రాజ రాజ చోర' ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ,' 'అర్జున ఫల్గుణ' దెబ్బకొట్టేసింది. ఆ తర్వాత 'భళా తందనాన' సైతం అదే దారిలో ప్రయాణించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios