టాలీవుడ్ లో ఎవరు ఊహించని విధంగా సంచలనం సృష్టించి వార్త శ్రీ రెడ్డి లీక్స్. దగ్గుబాటి సురేష్ రెండవ కుమారుడికి సంబందించిన ఫోటోలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆమె చేసిన కామెంట్స్ ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా  నేషనల్ మీడియాలో మొత్తంగా టాలీవుడ్ పై అనేక కథనాలు వెలువడ్డాయి.

అయితే రీసెంట్ గా శ్రీ రెడ్డి చేసిన మరొక కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అభిరామ్ తో తన ఫస్ట్ నైట్ రామానాయుడు స్టూడియోలో జరిగినట్లు చెబుతూ.. ఆ ప్లేస్ త్వరలోనే మాయం కానుందని శ్రీ రెడ్డి సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేసింది. దీంతో ఆ పోస్ట్ నేషనల్ మీడియాని కూడా తాకింది. ఇటీవల రామానాయుడు స్టూడియో అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

రామానాయుడు స్టూడియోస్ ని ఫ్లాట్స్ గా మార్చేసి సురేష్ బాబు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయనున్నారని టాక్ వచ్చింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో రామానాయుడు పేరుతో మరొక కొత్త స్టూడియోని నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ వార్తలపై స్పందించిన శ్రీ రెడ్డి తమ మొదటి రాత్రి అక్కడే జరిగిందని కౌంటర్ ఇవ్వడం వైరల్ గా మారింది.