సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిసాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ, బాలు గారు కూడా ఇదే మహమ్మారి బారినపడి కాలం చేయడంతో సినీ లోకం అంతా తరలిరాలేకపోయింది. అయినా ఆయనను కడసారి చూసి వీడ్కోలు పలికేందుకు ఎందరో ప్రముఖులు అక్కడకు విచ్చేసి ఆయనకు నివాళి అర్పించారు. 

సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌, దర్శక, నిర్మాత, నటుడు భారతీరాజా పాల్గొన్నారు. వీరితో పాటు యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ తదితరులు హాజరయ్యారు. మిగిలిన నటులు, ఇండస్ట్రీ ప్రముఖులు వీడియో ద్వారా తమ సందేశాన్ని పంపించారు. 

తమిళనాడు ప్రభుత్వం అధికార లాంఛనాలతో బాలు అంత్యక్రియుయాలకు ఏర్పాట్లు చేసింది. పోలీసులు గౌరవవందనం సమర్పించారు. గత నలభై రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కరోనాతో చేసిన పోరాటంలో ఓడిపోయారు. అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తారు. 

ఇక నేటి ఉదయం శ్రౌత శైవ వైదిక శైవ సాంప్రదాయ పద్దతుల్లో అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. కుమారుడు ఎస్పీ చరణ్ చేతులమీదుగా వేద పండితులు పూజలు చేయించారు. అనంతరం శ్రౌత శైవ వైదిక శైవ సాంప్రదాయాన్ని అనుసరించి బాలసుబ్రహ్మణ్యం పార్దీవ దేహాన్ని ఖననం చేశారు.

బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు శైవులు. వారును పరమశివుడిని కొలుస్తారు. ఆ పద్ధతి ప్రకారమే పార్థివదేహాన్ని దహనం చేయకుండా ఖననం చేసారు. భారతీయ చిత్రపరిశ్రమని విషాదంలో నింపుతూ బాలు అనంతలోకాలకు తరలి వెళ్లారు. 

కరోనా కారణంగా ఆగస్ట్ మొదటి వారంలో బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో జాయిన్‌ అయిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఆయన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఒకానొక టైమ్‌లో ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది. ఐసీయూలో, వెంటిలేషన్‌పై చికిత్స అందించారు. 

ఆ తర్వాత ఎక్మో విధానంలోనూ ట్రీట్‌ మెంట్‌ అందించారు. విదేశీ వైద్యులు సైతం ఆయనకు ట్రీట్‌మెంట్‌ చేశారు. ఎంతో పోరాటంతో ఆయన గత వారం రోజుల క్రితం కరోనా నుంచి నెగటివ్‌ పొందినట్టు వెల్లడించారు. ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. క్రమంగా ఆయన ఆరోగ్యం కోలుకుంటుందని, మాట్లాడుతున్నారని తెలిపారు. కానీ గురువారం మళ్ళీ ఆయనకు మళ్లీ సీరియస్‌ అయ్యిందన్నారు.

ఆయనను బ్రతికించడానికి వైద్యులు అనేక ప్రయత్నాలను చేసినప్పటికీ.... ఆయనను  మధ్యాహ్నం ఈ గానగంధర్వుడు భువినుండి దివికేగారు.