ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం హాస్యనటుడు అల్లు రామలింగయ్యకు ఓ పాట పాడారు. ఆ పాట ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది. ముత్యాలూ.. వస్తావా.. అనే పాట అది. అది ఓ ప్రత్యేకమైన స్వరంతో బాలు పాడారు ఆ పాట విన్న అల్లు రామలింగయ్య... నేను అంత ముక్కుతో మాట్లాడుతానా.. అని అడిగారట. ఆ పాట మనషులంతా ఒక్కటే సినిమాలోది.

ఎస్బీ బాలసుబ్రహ్మణ్యంకు ఇష్టమైన నటులు అల్లు రామలింగయ్య, కమల్ హాసన్. ఎస్బీ బాలు కమల్ హాసన్ ను తమ్ముడు అని పిలుస్తారు. కమల్ హాసన్ సినిమాలకు డబ్బింగ్ చెప్పింది కూడా బాలుయే. కమల్ హాసన్ కు పాడిన చాలా పాటలు హిట్టయ్యాయి. 

బాలుకు స్వీట్లు అంటే ఇష్టం. మరీ ముఖ్యంగా మిల్క్ స్వీట్లు.. పాలకోవా కనిపిస్తే ఆబగా లాగించావరట. టెన్నిస్, క్రికెట్ అంటే బాలుకు ఇష్టం. 
చిన్నప్పుడు బాలుకు ఆయన తల్లి ఆడపిల్లల దుస్తులు వేసింది. తనకు అడపిల్ల పుట్టలేదని చెప్పి అలా దుస్తులు వేసి ముచ్చట తీర్చుకునేదట.

ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం ద్వంద్వార్థాల పాటల పాడడానికి నిరాకరిస్తూ వచ్చారు. కసి కసిగా ఉంది, చల్లగాలి వీస్తోంది, బలం పట్టి.. వంటి పాటలు పాడిన బాలు ఆ తర్వాత ద్వంద్వార్థాలు ఉండే పాటలు పాడడం మానేశారు. తాను పాడడానికి నిరాకరిస్తూ వచ్చారు. దానివల్ల యువ గాయకులకు అవకాశం లభించింది. మను వంటి గాయకుడు ముందుకు రావడానికి కారణం అదే.