Asianet News TeluguAsianet News Telugu

అరే.. ఒరే.. అని పిలుచుకునేంత స్నేహం: ఇళయరాజాతో ఎస్బీ బాలు గొడవ

ఇళయరాజా నుంచి ఎస్బీ బాలసుబ్రహ్మణ్యంకు లీగల్ నోటీసులు వచ్చాయి. తన పాటలు బాలు పాడవద్దని ఆ లీగల్ నోటీసులు జారీ చేశారు. ఆ లీగల్ నోటీసులు అందుకున్న తర్వాత బాలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. 

SP Balasubrahmanyam And Ilaiyaraaja Controversy
Author
Chennai, First Published Sep 25, 2020, 2:46 PM IST

సంగీత దర్శకుడు ఇళయరాజాతో ఎస్బీ బాలసుబ్రహ్మణ్యంకు అరే.. ఒరే.. అని పిలుచుకునేంత స్నేహం ఉంది. బాలసుబ్రహ్మణ్యం అమెరికాలో ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో ఆ వివాదం చోటు చేసుకుంది. అమెరికాలో బాలు 12 కార్యక్రమాలు చేయడానికి అంగీకరించారు. అప్పటికి రెండు కార్యక్రమాలు అయిపోయాయి.

అనూహ్యంగా ఇళయరాజా నుంచి లీగల్ నోటీసులు వచ్చాయి. తన పాటలు బాలు పాడవద్దని ఆ లీగల్ నోటీసులు జారీ చేశారు. ఆ లీగల్ నోటీసులు అందుకున్న తర్వాత బాలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇక తర్వాతి కార్యక్రమాల్లో ఇళయరాజా పాటలు పాడనే లేదు. ఆ విషయాన్ని కార్యక్రమాల నిర్వాహకులకు కూడా చెప్పారు. ఇళయరాజా పాటలు పాడుకున్నా ఎందుకు పాడలేదని అడిగినవారు లేరు. 

అయితే, ఇళయరాజా ఆ నోటీసులు ఎందుకు ఇచ్చారనే విషయం ఎవరికీ తెలియదు. బాలు కూడా ఎక్కడా ఆ విషయం చెప్పలేదు. ఇళయరాజాకు ఫోన్ చేస్తే సరిపోతుందని చాలా మంది బాలుకు చెప్పారట. కానీ ఆయన వినలేదు. భారతీరాజా ద్వారా ఇళయరాజా బాలుకు పరిచమయ్యారు. భారతీరాజా బాలుకు మంచి స్నేహితుడు. 

ఆ వివాదానికి ముందు ఆ ఏడాది జూన్ 4వ తేదీన మూకాంబికా సన్నిధిలో ఇళయరాజా, బాలు కలుసుకున్నారు. ఇళయరాజా చిత్ర, చరణ్, కార్యక్రమ నిర్వాహకులకు, ఆడిటోరియం యజమానులకు కూడా నోటీసులు జారీ చేశారు. అదీ ఇళయరాజాపై ఎస్బీ బాలుకు కోపం.

Follow Us:
Download App:
  • android
  • ios