హౌస్ ఫుల్, గజినీ లాంటి హిందీ చిత్రాల్లో నటించిన యువ నటి జియా ఖాన్ 2013లో తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసు ఇప్పటికి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గానే ఉంది. దీనికి కారణం జియా ఖాన్ తల్లి రబియా నటుడు సూరజ్ పంచోలిపై నమోదు చేసిన కేసే. 

తన కుమార్తె మరణానికి కారణం సూరజ్ అంటూ ఆమె కేసు నమోదు చేశారు. దీనితో ఈ కేసులో సూరజ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. గత ఆరేళ్లుగా అతడు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. సూరజ్, జియా ఖాన్ గతంలో ప్రేమించుకున్నారు. వారి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ జియా ఖాన్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. 

అప్పట్లో జియా ఖాన్ మరణం బాలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అప్పుడప్పుడే నటిగా ఎదుగుతున్న జియా ఖాన్ జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసిపోవడంపై అంతా విచారం వ్యక్తం చేశారు. సూరజ్ పంచోలిపై తీవ్రమైన ఆరోపణలతో రబియా కేసు నమోదు చేసింది. 

అదే సమయంలో మీడియా కూడా సూరజ్ గురించి పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం చేసింది. గత ఆరేళ్లుగా ఈ కేసు వాయిదాల పద్దతిలో విచారణ జరుగుతూనే ఉంది. తాజాగా సూరజ్ మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. జియా ఖాన్ మరణానికి తాను కారణం కాదని అన్నాడు. మీడియా రాద్ధాంతం తనో నిందితుడిగా మీ ముందు నిలుచున్నా. దీనివల్ల నా కెరీర్ దెబ్బతింటోంది. 

ఈ కేసు త్వరగా విచారణ జరగాలని ఒరుకుంటున్న మొదటి నిందితుడిని నేనే నెమో. జియా మరణానికి కారణం తానే అని ఆరోపిస్తున్న ఆమె తల్లి ఇంతవరకు ఒక్క వాయిదాకు కూడా కోర్టులో హాజరు కాలేదు అని సూరజ్ ఆరోపించాడు. ఆమెకు బ్రిటన్ పాస్ పోర్ట్ ఉంది. ఎలాంటి ఆరోపణలు చేసినా చెల్లుతుందనేది ఆమె ధీమా. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు దోషులు ఎవరో అని సూరజ్ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

నాపై వస్తున్న అసత్య ఆరోపణలని మీడియా హైలైట్ చేసింది. దీని వల్ల నేను మాత్రమే కాదు నా కుటుంబం కూడా ఇబ్బంది పడుతోంది. మీడియా చెప్పినవాటిలో 5 శాతం కూడా నిజాలు లేవు. నేను కోర్టునే నెమ్ముకున్నా. త్వరగా నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నా అతనూ సూరజ్ వ్యాఖ్యానించాడు. 

సూరజ్ పంచోలి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఆదిత్య పంచోలి తనయుడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిర్మించిన 'హీరో' చిత్రంతో సూరజ్ బాలీవుడ్ కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత జియా ఖాన్ ప్రేమలో పడడం.. కొంత కాలానికి ఆమె ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది.