Asianet News TeluguAsianet News Telugu

ఎడాపెడా దానాలు: సోనూసూద్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

సోనూసూద్ దాదాపుగా 20 సంవత్సరాల నుండి చిత్ర పరిశ్రమలో ఉన్నాడు. బాలీవుడ్ తోపాటుగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా సోనూసూద్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. 

Sonu Sood Net Worth, All You Need To Know About
Author
Mumbai, First Published Jul 28, 2020, 5:10 PM IST

సోనూసూద్- ఈ పేరు తెలియని భార్ఫాతీయుడుండడంటే అతిశయోక్తికాదేమో. లాక్ డౌన్ కి ముందు వరకు సినిమాల్లో విలన్ గా నటించే వ్యక్తిగా మాత్రమే సోనూసూద్ అందరికి తెలుసు. కానీ... లాక్ డౌన్ వేళ ఆయన చిక్కుకున్న వారందరికీ ఆత్మబంధువయ్యాడు. 

వలస కార్మికులు, విద్యార్థులు అన్న తేడా లేకుండా ఎక్కడ చిక్కున్నవారినైనా సరే, వారి సొంతూర్లకు పంపించాడు. కేవలం దేశంలో చిక్కుకున్నవారిని మాత్రమే కాదు, విదేశాల్లో చిక్కుకున్నవారిని సైతం భారతదేశానికి తీసుకొచ్చాడు. 

ఈ కరోనా కష్టకాలంలో ఎవరికీ ఏ ఆపదొచ్చినా.. అందరూ సోనూసూద్ నామాన్ని తలుస్తున్నారు. తాజాగా మన చిత్తూరు జిల్లా రైతుకి ట్రాక్టర్ ని కూడా కొనిచ్చాడు. చేతికి ఎముక లేనట్టుగా ఇలా దానధర్మాలు చేస్తున్న సోనూసూద్ ఆస్తి ఎంతుంటుందనేది ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ నడుస్తున్న ఒక చర్చ. 

సోనూసూద్ దాదాపుగా 20 సంవత్సరాల నుండి చిత్ర పరిశ్రమలో ఉన్నాడు. బాలీవుడ్ తోపాటుగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా సోనూసూద్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. 

ఇన్ని సంవత్సరాలుగా సంపాదించినా డబ్బును ప్లానింగ్ తో బాగానే పొదుపు చేసాడు సోనూసూద్. అలా సంపాదించినా డబ్బుతో హోటళ్లను తెరిచాడు. ముంబై సహా మరికొన్ని పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లను తెరిచి ఆ బిజినెస్ చేస్తున్నాడు. తాజగా ముంబైలోని తన హోటల్ ని సైతం క్వారంటైన్ కేంద్రంగా వినియోగించడానికి ముంబై మునిసిపల్ అధికారులకు అప్పగించాడు. 

సోనూసూద్ మొత్తం ఆస్తుల విలువ 130 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కరోనా కష్టకాలంలో దాదాపుగా 10 కోట్ల రూపాయల వరకు సొంతడబ్బును ఖర్చుబెట్టాడు. వలస కార్మికులకు వెళ్ళడానికి రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయడంతోపాటుగా, ఆకలి అన్నవారికందరికీ అన్నం పెట్టాడు. 

ఎక్కడ ఎవరు ఏ సహాయం కావాలన్న వెనుకాడలేదు. తన వల్ల అయిందంతా చేసాడు. విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చాడు. వారికోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి అధికారుల నుంచి అవసరమైన అన్ని అనుమతులను సంపాదించి సొంత డబ్బుతో వారిని ఇంటికి చేర్చాడు. 

ఈ కరోనా కష్టకాలంలో తన కున్న దాంట్లోనే ఇంత స్థాయిలో ఖర్చుపెడుతున్న సోనూసూద్ నిజంగా హీరో. వేల కోట్లు సంపాదించినా చాలా మంది సూపర్ స్టార్లు ఇచ్చిన దానికన్నా సోనూసూద్ కొన్ని వందలరెట్లు ఎక్కువ సహాయం చేసాడు. ఆర్థికంగా మాత్రమే కాకుండా అందరికి భరోసాను కల్పించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios