మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వరుస సక్సెస్ లతో బాక్స్ ఆఫీస్ రికార్డులను అందుకుంటున్న కొరటాల మెగాస్టార్ 152వ సినిమా కోసం అంచనాలకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. సైరా సినిమా సక్సెస్ కాకపోవడంతో మెగాస్టార్ నెక్స్ట్ సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

అయితే సినిమాకు సంబందించిన కొన్ని రూమర్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. సినిమాలో మహేష్ బాబు గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు టాక్ వస్తోంది,. ఇక విలన్ గా అరుంధతి విలన్ సోను సూద్ నటించనున్నట్లు తెలుస్తోంది. మరీ ఇవి ఎంతవరకు నిజమో తెలియదు గాని త్వరలోనే సినిమాకు సంబందించిన ఒక స్పెషల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. ఇక సెట్స్ కోసమే దర్శకుడు కొరటాల ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.  చూస్తుంటే సినిమా బడ్జెట్ 150కొట్లను దాటేలా కనిపిస్తోంది.

కేవలం ఒక కాలనీ సెట్ కోసమే 20కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారట. అలాగే సినిమాలో ఒక టెంపుల్ కూడా చాలా కీలకమైనది కావడంతో అందుకు సంబందించిన సెట్ కోసం భారీగా ఖర్చు చేయనున్నారట.  దర్శకుడు కొరటాల ఎంత ఖర్చు చేసినా కమర్షియల్ యాంగిల్ మిస్ కాకుండా మంచి లాభాలని అందిస్తాడని నిర్మాత రామ్ చరణ్ కాస్ట్ దగ్గర వెనుకాడడం లేదు. మరీ ఇంతలా అంచనాలకు మించి నిర్మిస్తున్న ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.