హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆధిక్యం హోరాహోరీగా ఉంది. బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య రసవత్తర పోటీ జరుగ్తుహోంది. ఈ క్రమంలో బీజేపీ టికెట్ పొంది అదంపూర్ స్థానం నుంచి పోటీ చేసిన టిక్‌టాక్ స్టార్ సోనాలీ ఫొగట్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కుల్దీప్ బిష్నోయ్ తో పోటీ పడ్డ ఆమె 
ఓడిపోయింది. 

మహారాష్ట్ర, హర్యానాల్లో వోటింగ్ శాతం గతంతో పోలిస్తే తగ్గింది. 2014లో జరిగినఅసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో 63 శాతం పోలింగ్ నమోదవ్వగా ఈ సారి అంతకన్నా తక్కువగా కేవలం 60శాతం మాత్రమే నమోదయింది. హర్యానాలో గత దఫా 77 శాతం పోలింగ్ నమోదవ్వగా ఈ సరి అది దాదాపుగా 12శాతం తగ్గి 65 శాతం నమోదయ్యింది.

ముంబైలోనే కాదు... దేశం మొత్తం తిట్టిపోస్తారు!

ఇక ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే హర్యానా,మహారాష్ట్రలో కమలం పార్టీ పూర్తి హవా ప్రదర్శిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఘంటాపథంగా చెబుతున్నాయి. హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్, మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ లు మరోమారు ముఖ్యమంత్రి పీఠాలు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఇకపోతే హుజూర్ నగర్ విషయానికి వస్తే, ఆరా,మిషన్ చాణక్యులు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించాయి. ఈ రెండు సంస్థలు కూడా తెరాస ఈ సీటును గెలుచుకోవడం తథ్యమని చెప్పాయి.