బాలీవుడ్ రొమాంటిక్ హీరో షాహిద్ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ రొమాంటిక్ హీరో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక బాలీవుడ్ లోకి దబాంగ్ చిత్రంతో సునామిలాగా దూసుకువచ్చిన బ్యూటీ సోనాక్షి సిన్హా. సోనాక్షి సిన్హా కూడా బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. 

సోనాక్షి సిన్హా, షాహిద్ కపూర్ ల మధ్య ఎఫైర్ పై గతంలో అనేక రూమర్స్ వినిపించాయి. 2013లో ఈ జంట ఘాడమైన ప్రేమలో మునిగితేలినట్లు, సహజీవనం చేసినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఆర్.. రాజ్ కుమార్ అనే చిత్రంలో నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య ఎఫైర్ సాగింది. ఆ తర్వాత విడిపోయారు. 

చాలా చూశా.. ఐటీ కంపెనీల్లో సెక్స్, హీరోయిన్లు ఒప్పుకుంటేనే.. నందిని రాయ్ హాట్ కామెంట్స్

2015లో షాహిద్ కపూర్.. మీరా రాజ్ పుత్ ని వివాహం చేసుకున్నారు. తాజాగా సోనాక్షి.. షాహిద్ తో రిలేషన్ గురించి స్పందించింది. షాహిద్ కపూర్ ఇప్పటికి తనకు మంచి స్నేహితుడు అని తెలిపింది. కొందరు పనికట్టుకుని ఇలాంటి రూమర్లు సృష్టిస్తారు. అవి కాస్త వైరల్ అవుతుంటాయి. 

పెళ్లి కానీ హీరో, హీరోయిన్ షూటింగ్ లో ఉంటే చాలు.. ఏదైనా రూమర్ సృష్టిస్తే సరదాగా ఉంటుందని ఇలాంటి పుకార్లు పుట్టిస్తారు. ఇలాంటి రూమర్లని నేను పట్టించుకోను. మా గురించి వచ్చిన వార్తలు చూసి నేను , షాహిద్ నవ్వుకున్నాం అని సోనాక్షి చెప్పుకొచ్చింది.