మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఫైనల్ గా ట్రాక్ లో పడ్డాడు. చిత్రలహరికి ముందు వరుసగా అపజయాలతో సతమతమైన ఈ యువ హీరో ఇటీవల మారుతి దర్శకత్వంలో చేసిన 'ప్రతి రోజు పండగే' సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద చాలా కాలం తరువాత తన సత్తా చాటాడు. అంతకుముందే సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా తన ఎనర్జీ ద్వారానే ఈ హీరో అవకాశాలు అందుకుంటున్నాడని చెప్పవచ్చు.

ఇక నెక్స్ట్ అదే రేంజ్ లో సక్సెస్ అందుకోవాలని  మరొక డిఫరెంట్ కథతో రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ లో సినిమా రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పనులు సగానికి చేరుకున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేసి ప్రమోషన్స్ డోస్ పెంచాలని చూస్తున్నారు.  

అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమా కి సంబందించిన ఒక స్పెషల్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 'సోలో బ్రతుకే సో బెటర్' అంటూ టైటిల్ తోనే యువతను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్న సాయి ధరమ్ తేజ్ సినిమాతో ఇంకెంతగా ఆకట్టుకుంటాడో చూడాలి. ఇక ఫస్ట్ గ్లిమ్ప్స్ ని లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారు. మునుపెన్నడు లేని విధంగా సాయి ఈ సినిమాలో సరికొత్తగా ఎట్రాక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.