పాపులర్ కామెడీ షో జబర్దస్త్ పై వస్తున్న విమర్శలు ఈ నాటివి కాదు. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో విమర్శలు ఎదురవుతున్నాయి. జబర్దస్త్ లో చేసే స్కిట్స్ లో మహిళలని అసభ్యంగా, కించపరిచే విధంగా చిత్రీకరిస్తున్నారంటూ విమర్శలు ఎదురయ్యాయి. పంచ్ డైలాగుల పేరుతో బూతు డైలాగులు, డబుల్ మీనింగ్ డైలాగులు చెబుతున్నారు. 

తాజాగా ప్రముఖ మహిళా నేత కృష్ణ కుమారి జబర్దస్త్ షోపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ షోని ఆపేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. అసలు జబర్దస్త్ షో గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసభ్యకరంగా డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు ఎందుకు వాడుతున్నారు అని ప్రశ్నిస్తే జబర్దస్త్ వాళ్ళు ఏవేవో సమాధానాలు చెబుతున్నారు. 

శ్రద్దా దాస్ బోల్డ్ షో.. ఘాటు అందాలతో రెచ్చిపోతోంది

అన్ని వర్గాల ప్రేక్షకులు టీవీ చూస్తుంటారు. ఇలా జబర్దస్త్ లో ఆడవాళ్ళని కించపరిచే విధంగా చిత్రీకరిస్తే ఎలాంటి సంకేతాలు వెళతాయి. మరికొన్ని స్కిట్ లు అక్రమసంబంధాల నేపథ్యంలో ఉంటున్నాయి. ఇలాంటి స్కిట్ లని టివిలో ఎలా ప్రసారం చేయిస్తారు. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. జబర్దస్త్ ని ఆపేస్తాం అని కృష్ణ కుమారి అన్నారు. 

ఒక షోని ఆపేయడం చాలా సులభం. కానీ జబర్దస్త్ లో చాలా ఎపిసోడ్స్, అనేక స్కిట్ లు ఉన్నాయి. ఏ ఏ స్కిట్ లలో బూతులు వాడారు, ఆడవారిని కించపరిచారు అని వెతికి వీడియోలు సేకరించాలి. ఇది కొంచెం కష్టమైనా ఆ వీడియోల్ని సేకరించి మహిళా కమిషన్ వద్దకు వెళతాం. దీనితో జబర్దస్త్ ముగుస్తుంది అని కృష్ణకుమారి హెచ్చరించారు.