అలనాటి హీరోయిన్ కస్తూరి అందరికి గుర్తుండే ఉంటుంది. అన్నమయ్య సినిమాలో నాగార్జునకు మరదలిగా, భారతీయుడు సినిమాలో కమలహాసన్ కూతురిలా తెలుగువారికి సుపరిచితమే. 

అలీ తో సరదాగా ప్రోగ్రాం కి సోమవారం నాడు ఆమె గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా తన బెడ్ పై రోజు రాత్రి ముగ్గురు మగాళ్లు ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేసారు. స్వయంగా కస్తురే తాను రోజు రాత్రి ముగ్గురు మగాళ్లతో పడుకుంటానని అన్నారు. 

ఈ వ్యాఖ్య స్వయంగా కస్తురే చేసినప్పటికీ... తప్పుగా మాత్రం అనుకోకండి. కస్తూరి బిడ్డకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు బిడ్డ పక్కనే ఉండవలిసి వచ్చిందట. అలా అప్పుడు బిడ్డ పక్కనే ఎక్కువ సమయం గడపడం, ఎప్పుడు ఏమవసరమొస్తుందో అని నిద్రాహారాలు మాని కన్న బిడ్డకు సేవలు చేసిందట. 

అలా నిద్రాహారాలు మాని ఉండడం వల్ల కొన్ని రోజులకు తనకు పూర్తిగా నయమయ్యాక ఇక నిద్ర పోదామన్నప్పటికీ... తనకు నిద్ర రాకపోయేదట. అప్పుడు తనను ముగ్గురు మొగాళ్ళు కాపాడారు అని చెప్పుకొచ్చారు. ఆ ముగ్గురు మొగాళ్ళ వల్లే తాను డిప్రెషన్ వంటి వాటి బారిన పడలేదని చెప్పుకొచ్చారు. 

ఆ సందర్భంగా ఆ ముగ్గురు తనకు తోడుగా ఉండి జీవితంలోని ఆ పరిస్థితుల నుండి గట్టెక్కించారని చెప్పుకొచ్చారు. ఆ ముగ్గురిలో మొదటి వ్యక్తి ఇళయరాజా. అలా తాను నిద్ర రాకుండా ఉన్నప్పుడు ఇళయరాజా పాటలు బాగా వినేదాన్నని, అందువల్లే తాను ఆ క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడగలిగానని చెప్పుకొచ్చారు. ఆ పాటలు ఎప్పుడు కూడా తనకు తోడున్నాయని చెప్పుకొచ్చారు. 

ఇక రెండవ వ్యక్తి తమిళ రచయిత పుదుమై పిత్తన్. ఈ రచయిత అసలు పేరు విరుద్ధాచలం. ఆయన తన పేరు మీద కన్నా తన కలం పేరు మీద బాగా ప్రసిద్ధుడు. ఆయన రచనలు విప్లవ భావాలు కలిగి ఉండేవి. ఆ కాలంలో తాను బాగా ఈ రచయిత పుస్తకాలు చదివానని చెప్పుకొచ్చారు కస్తూరి. 

ఇక మూడవ వ్యక్తి షిరిడి సాయి బాబా. సాయిబాబా ధ్యానంలో ఉండడం వల్ల తాను మానసికంగా కృంగిపోకుండా ఉండగలిగానని చెప్పుకొచ్చారు. తనకు అవసరమైన ఆధ్యాత్మిక స్వాంతన మద్దతు ఆయనలో దొరికాయని చెప్పుకొచ్చారు. 

ఎప్పుడు విరుద్ధాచలం పుస్తకాలు, ఇళయరాజా మ్యూజిక్, సాయి బాబా బొమ్మ తన బెడ్ మీద ఉంటాయని అందుకే ముగ్గురు మగాళ్లతో తాను పడుకుంటానని చెప్పుకొచ్చారు అలనాటి నటి, అందాలతార కస్తూరి.