'మహావీరన్' .. తెలుగులో 'మహావీరుడు'గా జులై 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదితి శంకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. 


సినిమాకు ఓ మాదిరి టాక్ వచ్చిందంటే ఓటిటిలో చూద్దాంలో అని డిసైడ్ అయ్యిపోతున్నారు. అందుకే సినిమాలకు థియేటర్స్ సమానంగా ఓటిటి రైట్స్ కూడా వెళ్తున్నాయి. రిలీజైన నెలలో ఆ సినిమాలు ఓటిటిలో ప్రత్యక్షమైపోతున్నాయి. అలాగే తాజాగా శివకార్తికేయన్ నటించిన మహావీరుడు చిత్రం ఓటిటి రిలీజ్ కు రంగం సిద్దమైంది.

శివకార్తికేయన్ తమిళంలో చేసిన 'మహావీరన్' .. తెలుగులో 'మహావీరుడు'గా జులై 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదితి శంకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. థియేటర్ లో జస్ట్ యావరేజ్ అనిపించుకున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ నెల 11వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.

చిత్రం కథేమిటంటే... సత్య(శివకార్తికేయన్‌) ఓ కార్టూనిస్ట్‌. మహావీరుడు పేరుతో కామిక్ కథలు రాస్తుంటాడు. నిజ జీవితంలో భయస్తుడు. కానీ తన కథలు మాత్రం సమాజం కోసం పోరాడే ఓ మహావీరుడి గురించే ఉంటాయి. తను ఉండే స్లమ్‌ ఏరియా నుంచి అందరిని వేరే ప్రాంతానికి తరలిస్తుంది ప్రభుత్వం. ఆ ఏరియా ప్రజలందరికి ఓ అపార్ట్‌మెంట్‌కి తరలిస్తారు. మంత్రి ఎమ్‌ ఎమ్‌ సూర్య(మిస్కిన్‌) మనుషులు నాసిరకం సిమెంట్‌తో ఆ అపార్ట్‌మెంట్‌ని నిర్మిస్తారు. పైకి అందంగా, అద్భుతంగా కనిపించినప్పటికీ.. ఇంట్లోకి వెళ్లిన తొలిరోజు నుంచి కిటికీలు పడిపోవడం, గోడలకు పగుళ్లు రావడం జరుగుతుంటాయి. 

ఇదేంటని ప్రశ్నిస్తే మంత్రి మనుషులు బెదిరిస్తారు. తన తల్లిని, సోదరిని అవమానించినా..సత్య ఎదురు తిరగడు. అయితే ఓ సందర్భంలో చనిపోవాలని అపార్ట్‌మెంట్‌ పైకి దూకేందుకు ప్రయత్నిస్తాడు సత్య. దెబ్బలు తగిలినా ప్రాణాలతో భయటపడతాడు.అక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని అతను ఎలా అధిగమిస్తాడు? అనేదే కథ.లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీతో కూడిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి. '