మహేష్‌, నమ్రతల ముద్దుల కుమార్తె సితారకు కూడా సోషల్‌ మీడియాలో ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ముద్దుల చిన్నారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వదిలితే చాలు.. షేర్లు, లైకులతో వాటిని వెంటనే వైరల్‌ చేసేస్తూంటారు నెటిజన్లు. ఈ క్రమంలో తాజాగా తన తండ్రి మహేష్‌ పాటకు సితార డ్యాన్స్‌ చేస్తుండగా తీసిన ఓ వీడియో బయిటకు వచ్చింది. ఫ్యాన్స్ ఆ వీడియోని తెగ షేర్ చేస్తూ మురిసిపోతున్నారు.   ఇంతకీ ఆ పాటేంటి..? దానికి సితార ఎలా డ్యాన్స్‌ చేసింది.. చూద్దాం.

మహేష్‌, రష్మిక జంటగా నటిస్తోన్న తాజా చిత్రం  ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలోని ‘హీ ఈజ్‌ సో క్యూట్‌’ అనే పాట రీసెంట్ గా విడుదలై  మ్యాజిక్ లవర్స్ ను విపరీతంగా అలరిస్తోంది. ఈ పాటకు డ్యాన్స్‌ చేస్తూ రష్మిక ఓ టిక్‌టాక్‌ వీడియోను కూడా విడుదల చేసిన సంగతి విదితమే. అయితే.. ఇదే పాటకు సితార కూడా తనదైన స్టైల్‌లో ముద్దుగా స్టెప్పులేసి దుమ్ము రేపింది. ఈ సందర్భంగా తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా తన డ్యాన్స్‌  సో  క్యూట్‌ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ఈ లిటిల్‌ సూపర్‌ స్టార్‌ డ్యాన్స్‌ వీడియోను మీకూ చూసేయాలని ఉందా అయితే ...ఓ లుక్కేయండి.

ఇక సితార ఇలా సినిమా పాటలకు డ్యాన్స్‌ చేయడం ఇది మొదట సారి కాదు. గతంలో ‘బాహుబలి’లోని ‘ముకుంద..’, ‘మహర్షి’ సినిమాలోని ‘పాటపిట్ట..’ పాటలకు డ్యాన్స్‌ చేసి అందరి మన్ననలూ పొందింది.

ఇక ఐదు రోజుల క్రితం విడుదలైన ‘హీ ఈజ్‌ సో క్యూట్’ పాటకు యూట్యూబ్‌లో తెగ రెస్పాన్స్ వస్తోంది. కోటి మందికిపైగా ఈ పాటను చూసారు. అంతేకాదు యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ఉంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాటను మధు ప్రియ పాడారు.