సింగర్ సుచిత్ర పేరు వినగానే సుచిలీక్స్ గుర్తుకు వస్తాయి. సుచిలీక్స్ పేరుతో సుచిత్ర 2017లోసృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పలువురు నటులు, సినీ ప్రముఖులు సుచిలీక్స్ కారణంగా వార్తల్లో నిలిచారు. హీరోయిన్ల నగ్న దృశ్యాలు,ప్ప్రయివేట్ ఫొటోస్ అయ్యాయి. 

ఆ దృశ్యాలు మాకు సంబంధించినవి కావు అంటూ కొందరు నటీమణులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దుమారం మొత్తం సుచిత్ర ట్విట్టర్ వేదికగానే జరిగింది. ఈ సంఘటన తర్వాత సుచిత్ర కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళింది. తాజాగా సుచిత్ర మరోమారు వార్తల్లో హిట్ టాపిక్ గా మారింది. 

సుచిత్ర మిస్సయింది అంటూ ఆమె సోదరి సునీత పోలీస్ కంప్లైంట్ నమోదు చేశారు. తాజాగా దీనిపై సుచిత్ర వివరణ ఇస్తూ తన కుటుంబంపైనే ఆరోపణలు చేసింది. తాను మిస్సవ్వలేదని తెలిపింది. కొంత సమయం నేను నా కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ లో లేను. ఓ స్టార్ హోటల్ లో ఉన్నాను. కానీ ఆమె సోదరి సునీత మాత్రం సుచిత్ర మానసిక పరిస్థితి బాగాలేదని పోలీసు ఫిర్యాదులో పేర్కొంది. 

దీనిపై సుచిత్ర స్పందిస్తూ తానేం పిచ్చిదాన్ని కాదని తెలిపింది. నా మానసిక ఆరోగ్యం బాగాలేదని ఓ క్లినిక్ లో చేర్పించారు. ఆసుపత్రి బయట నా సోదరి, ఆమె భర్త కాపలా ఉన్నారు. ఇందంతా చూస్తుంటే నాపై ఏదో కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందని సుచిత్ర పేర్కొంది. 

2017లో సుచిత్ర ట్విట్టర్ లో సుచిలీక్స్ పేరుతో నటుల ప్రైవేట్ ఫోటోలు లీక్ అయిన తర్వాత ఆమె భర్త కార్తీక్ స్పందించాడు. సుచిత్ర ట్విట్టర్ హ్యాక్ అయిందని తెలిపాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే.