ఇండియాలో కరోనా విజృంభన రోజురోజుకి హద్దులు దాటుతోంది. సినిమా ఇండస్ట్రీలలో కూడా కరోనా వైరస్ భయం మొదలైంది. ఇక బాలీవుడ్ సింగర్ కూడా కోవిడ్ 19 బారిన పడ్డారు. సన్నీ లియన్ బేబి డాల్ సాంగ్ పాడిన కనిక అందరికి సుపరిచితమే. ఇక ఇటీవల ఆమెకు వైద్య పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలింది. గత ఆదివారం యూకే నుంచి వచ్చిన కనిక ట్రావెలింగ్ లో ఎంతో మందిని కలుసుకుంటు వచ్చారు. 

అధికారులు ఆమెతో ప్రయాణం చేసిన వారి వివరాలను పరిశీలిస్తున్నారు. మరొక షాకింగ్ విషయం ఏమిటంటే.. రాగానే కనిక ఒక 5స్టార్ హోటల్ లో ఉన్నారు. అలాగే ఒక పార్టీలో పాల్గొన్నారు. ఆ పార్టీలో దాదాపు 100మందికి పైగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అధికారులు ఈ విషయాన్ని చాలా సిరీయస్ గా తీసుకున్నారు. వారం రోజుల వ్యవధిలోనే కరోనా మహమ్మారి 180 కి పైగా పాజిటివ్ కేసులను నమోదు చేసింది. 

దీంతో సింగర్ కనిక ట్రావెలింగ్ విషయం అందరిని భయానికి గురి చేస్తోంది. కరోనా మరణాల సంఖ్య కూడా కొంచెం కొంచెం పెరుగుతోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఆమె నుంచి మరికొందరికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మరిన్ని వివరాలు టెకీయాల్సి ఉంది.