'మీటూ' ఉద్యమం సమయంలో తను ఎదుర్కొన్న చేదు ఘటనలను బయటపెడుతూ తనలా బాధ పడిన వారికి తోడుగా నిలిచింది సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. ప్రముఖ గేయ రచయిత వైరముత్తు పేరుని బయటపెట్టి సంచలనాలకు తెరతీసింది చిన్మయి.

ఆ తరువాత తన ట్విట్టర్ అకౌంట్ లో వైరముత్తు, నటుడు, నిర్మాతైన రాధారవి పై ఆరోపణలు చేసింది. ఇది జరిగిన కొన్ని రోజులకే చిన్మయి డబ్బింగ్ యూనియన్ సభ్యత్వం రద్దయింది. సభ్యత్వం కొనసాగించడానికి ఆమె వార్షికరుసుము చెల్లించలేదని.. అందుకే సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు యూనియన్ పేర్కొంది.

కాస్ట్లీ కార్లు.. లగ్జరీ ఇల్లు.. ప్రభాస్ లైఫ్ స్టైల్ చూశారా..?

అప్పుడు డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ పదవిలో రాధారవి ఉన్నారు. సభ్యత్వం రద్దు విషయమై చిన్మయి కోర్టుని ఆశ్రయించగా.. కోర్టు చిన్మయి వాదనకు అనువుగా.. కేసు పరిశీలనలో ఉన్నంత కాలం ఆమె డబ్బింగ్ యూనియన్ సభ్యురాలిగానే పరిగణించాలని చెప్పింది. తాజాగా ఈ నెల డబ్బింగ్ యూనియన్ ఎన్నికలు జరగనున్నాయనే ప్రకటన విడుదలైంది.

మరోసారి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడానికి రెడీ అయ్యారు రాధారవి. ఆయనకి ప్రత్యర్ధిగా, రామరాజ్యం పార్టీ తరఫున ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేశారు చిన్మయి. అయితే సభ్యత్వం రద్దు చేసినప్పుడే డబ్బింగ్ యూనియన్ ఓటర్ల జాబితాలో నుండి చిన్మయి పేరుని తొలగించారు.

దీంతో 'సభ్యులు కానివారు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారని..?' ఓ వర్గం వారు ప్రశ్నిస్తున్నారు. అయితే కోర్టు మంజూరు చేసిన ఆర్డర్ లో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు తనకుందని చిన్మయి చెబుతోంది. ప్రస్తుతం చిన్మయి నామినేషన్ పత్రాలు పరిశీలనలో ఉన్నాయి. ఫిబ్రవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. మరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూడాలి!