ఇటీవల బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. వెండితెరపై ప్రదర్శించడానికి వీలులేని చిత్రాలని వెబ్ సిరీస్ ల రూపంలో డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లోకి వదులుతున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ 'ఆహా' యాప్ భాగస్వామ్యంతో శరత్ మరార్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ 'సిన్'. 

భార్యతో బలవంతపు శృంగారం అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరక్కుతోంది. జాగ్వార్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన దీప్తి సతి, జెన్నిఫర్, నటుడు రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పెళ్లయ్యాక భార్యతో బలవంతంగా శృంగారం చేయాలనుకునే భర్త.. అతడి వల్ల చిత్ర హింసలు అనుభవించే భార్య.. అనే కాన్సెప్ట్ తో దర్శకుడు నవీన్ మేడారం ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నారు. 

ఇటీవల సిన్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో శృంగార సన్నివేశాలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం సిన్ ట్రైలర్ సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. త్వరలో ఈ వెబ్ సిరీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.