బాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రేమకథలు పుట్టుకువస్తూనే ఉంటాయి.  మొన్నటిదాకా.. ఒకరితో రిలేషన్ లో ఉన్నవారు.. కొద్దిరోజులకే వాళ్లకి బ్రేకప్ చెప్పి.. మరొకరితో ప్యాచప్ అవుతూ ఉంటారు. గతంలో..సిద్ధార్థ్ మల్హోత్రా, అలియా భట్ ప్రేమలో మునిగి తేలారు. తర్వాత విడిపోయారు. అలియా ప్రస్తుతం.. రణ్ బీర్ తో ప్రేమాయణం నడుపుతుండగా.. సిద్దార్థ్.. కియారాతో రిలేషన్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

సిద్దూ-కియారా ఎప్పుడూ తమ ఫోన్ ద్వారా టచ్‌లో ఉంటున్నారని, ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఎక్కువ సమయం గడుపుతున్నారని తెలుస్తోంది. కాగా.. ఇటీవల కియారా పుట్టిన రోజు జరుపుకోగా... ఆమెకు సిద్థార్థ మల్హోత్రా చాలా భిన్నంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. గతేడాది.. కియారా తన బర్త్ డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. బాలీవుడ్ లోని చాలా మంది ఆ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో.. సెలబ్రేషన్న్ చేసుకోవడానికి లేకుండా పోయింది.

దీంతో... సిద్ధార్థ మల్హోత్రా.. సోషల్ మీడియా వేదికగా కియారాకి బర్త్ డే విషెస్ తెలియజేశాడు. తన స్టేటస్ లో కియారా ఫోటో పెట్టి.. దానికి క్యాప్షన్ ఇచ్చాడు. ‘హ్యాపీ బర్త్ డే సన్ షైన్ గర్ల్, బిగ్ లవ్ అండ్ హగ్’ అంటూ కియారా ఫోటో వద్ద కామెంట్ పెట్టాడు. కాగా.. ఈ క్యాప్షన్ తో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు మరోసారి కన్ఫామ్ అయ్యింది. ఇప్పటి వరకు వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ రావడమే తప్ప.. అధికారికంగా ఇద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు.  కాగా.. పుట్టిన రోజు సందర్భంగా కియారా అభిమానులతో లైవ్ చాట్ లోకి రాగా.. అందులోకి సిద్ధార్థ కూడా వచ్చి కామెంట్ చేయడం విశేషం.