Asianet News TeluguAsianet News Telugu

'ఇప్పుడు పర్మినెంట్ బుకింగ్' .. వివాహబంధంతో ఒక్కటైన  కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్ర

బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్ర, హీరోయిన్ కియారా అద్వానీలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అతికొద్ది మంది కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

Sidharth Malhotra, Kiara Advani wedding
Author
First Published Feb 8, 2023, 12:29 AM IST

బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), కియారా అద్వానీ (Kiara Advani)లు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి బంధంతో ఈ ప్రేమ జంట ఒక్కటైంది. రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలస్‌లో మంగళవారం సాయంత్రం కియారా, సిద్ధార్థ్‌ల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే.. ఈ వివాహ వేడుక చాలా ప్రైవేట్ గా జరుపుకున్నారు. కొద్దిమంది కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది సన్నిహితులు, సినీ ప్రముఖులు వీరి వివాహ వేడుకకు హాజరయ్యారు.వీరి పెళ్లికి కరణ్ జోహార్, మనీష్, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్, జూహీ చావ్లా, రామ్ చరణ్ మరికొందరు సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరయ్యారట.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి కియారా అద్వానీ తన ట్విట్టర్ వేదికగా తమ పెళ్లి ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. 'ఇప్పుడు మా శాశ్వత బుకింగ్ పూర్తయింది' అని ఫొటోలకు కియారా అద్వానీ క్యాప్షన్ పెట్టారు. నూతన జీవితం ప్రారంభించబోతున్న తమకు అందరి ఆశీస్సులు, ప్రేమ కావాలని కియారా పేర్కొన్నారు. పెళ్లి వేడుకలో కియారా అద్వానీ లేత గులాబీ వర్ణం లెహంగాలో తళతళ మెరిసిపోయారు. ఈ లెహంగాను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా చేత ప్రత్యేకంగా డిజైన్ చేయించారట. ఇక  సిద్ధార్థ్ ఐవరీ షేర్వాణీ ధరించారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోస్.. వీడియోస్ నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.

 

‘షేర్షా’ సినిమాలో  కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలు జంటగా నటించారు.   సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారింది. ఆ తర్వాత .. ఆఫ్ స్క్రీన్ లో కూడా చాలా సార్లు సందడి చేయడం. ఇద్దరూ కలిసి పలు ఇవెంట్స్ కలిసి హాజరు కావడంతో  వీళ్లిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే వీరిద్దరితోపాటు.. సినీ ప్రముఖులు ఎవరూ కూడా ఈ జంట పెళ్లి గురించి స్పంధించకపోవడం కూడా గమనార్హం. మొత్తానికి ఆ ప్రేమ జంట.. ఫిబ్రవరి 7న పెళ్లిబంధంతో అధికారికంగా ఇద్దరూ ఒక్కటయ్యారు. కియారా, సిద్ధార్థ్‌ల వివాహ వేడుకలు ఈనెల 4వ తేదీ నుంచే ప్రారంభమయ్యాయి. సోమవారం నాడు మెహందీ, సంగీత్ ఏర్పాటు చేశారు. అంతకుముందు గెస్టులకు వెల్‌కమ్ లంచ్ ఏర్పాటుచేశారు. సోమవారం రాత్రి గ్రాండ్ సంగీత్ నైట్ నిర్వహించినట్టు సమాచారం.

ఇదిలా ఉంటే.. నటి కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితం. ఆమె మహేశ్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ప్రస్తుతం ఆమె తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నూతన ప్రాజెక్టు ఆర్సీ 15 చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం.. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో కియారాతోపాటు.. శ్రీకాంత్, అంజలి కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, కియారా అద్వానీలపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. కానీ..ఈ పెళ్లి కారణంగా.. ఆ పాట షూటింగ్ వాయిదా పడింది. 

Follow Us:
Download App:
  • android
  • ios