వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 27 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని.. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయింది.
డీజె టిల్లు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీ గా రిలీజ్ అయింది. ఎక్సపెక్ట్ చేసినట్లుగానే మార్నింగ్ షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బుకింగ్స్‌తోనే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ దుమ్మురేపాయని సమాచారం. ఒక్క హైదరాబాద్‌లోనే టిల్లు స్క్వేర్ మూవీకి కోటిన్నర వరకు గ్రాస్ బుకింగ్స్ అయినట్లు ట్రేడ్ వర్గాలు మాట. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రెండున్నర కోట్లకు పైగా గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ అయినట్టుగా చెబుతున్నారు. ఇక ఓవర్సీస్ ప్రీమియర్స్‌తోనే ఆల్మోస్ట్ 500K డాలర్ మార్క్‌ను టచ్ చేసినట్టుగా సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో సినిమా పార్ట్ 1 క్రేజ్ దృష్ట్యా దుమ్ము దుమారం లేపే ఓపెనింగ్స్ ను అందుకుంది. అదే సమయంలో ఈ సినిమా ఓవర్సీస్ లో అంచనాలను అన్నీ కూడా మించి పోయే సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. లాస్ట్ మినిట్ లో కొన్ని చోట్ల ప్రింట్స్ డిలే వలన షోలు కాన్సిల్ అయినా కూడా ఆల్ మోస్ట్ హాల్ఫ్ మిలియన్ మార్క్ రేంజ్ దాకా గ్రాస్ ఓపెనింగ్స్ ను అమెరికాలో సొంతం చేసుకుంది. ఈ సినిమా టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నట్లే అని చెప్పాలి.
ఈ సినిమా నిర్మాత నాగవంశీ టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ.. ఫస్ట్ డే 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావచొచ్చని అన్నారు. అలాగే లాంగ్ రన్‌లో 100 కోట్లు కొల్లగొడుతుందని చెప్పాడు. దీంతో.. టిల్లు ఎంత రాబడుతుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 27 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని.. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయింది.
