అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైన‌ర్‌గా వ‌చ్చిన డీజే టిల్లు సినిమాకు మొదటి రోజు సూపర్ హిట్‌ టాక్ వచ్చింది.  

 సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన డీజే టిల్లు ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. కొత్త దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన టిల్లు ప్రేక్షకులకు తెగ నచ్చేశాడు. 'అట్లుంటది మనతోని' అనే సినిమా ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. 

ట్రైలర్ తో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవటంతో సినిమాపై అంచనాలు పెరిగి చిన్న సినిమాల్లో పెద్ద ఓపినింగ్స్ తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రం సీక్వెల్ కూడా షూట్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో మళ్లీ ఓ సారి టిల్లుని గుర్తు చేయటానికి అన్నట్లుగా ..రిరిలీజ్ చేస్తున్నారు. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఆగస్ట్ 18 శుక్రవారం రీరిలీజ్ అవుతోంది. 

హీరో సిద్ధూ టిల్లు పాత్రకు చాలా దగ్గరి వ్యక్తిత్వం ఉన్నవాడు. అతను హైదరాబాద్‌ కుర్రాడు. అతని హావభావాలు, మాట్లాడే తీరు, తరహా అంతా డిజె టిల్లు పోలికలతో ఉంటుంది. అందుకే ఈ పాత్రకు సిద్ధూ టైలర్‌ మేడ్‌ లా అనిపించాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైన‌ర్‌గా వ‌చ్చిన డీజే టిల్లు సినిమాకు మొదటి రోజు సూపర్ హిట్‌ టాక్ వచ్చింది. దాంతో ఖిలాడి లాంటి పెద్ద సినిమా బరిలో ఉన్నా కూడా కలెక్షన్స్ విషయంలో ఏమాత్రం తగ్గలేదు డీజే టిల్లు. 

లాస్ట్ ఇయిర్ ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. కేవలం రూ.8 కోట్ల బిజినెస్ చేసిన డీజే టిల్లు ఇప్పటికే 7 కోట్ల లాభాలు తీసుకొచ్చింది. సినిమా కొనుక్కొన్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ లాభాల్లోకి వచ్చాడు. డీజే టిల్లు సినిమాకు రూ.8.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సిద్ధు జొన్నలగడ్డ సినిమాకు ఇది చాలా ఎక్కువ కానీ ఈ సినిమాపై నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు. వాళ్ల నమ్మకం నిజమైంది.. లాభాల పంట పండింది.