దక్షిణాదిలో నటుడిగా గుర్తింపు సొంతం చేసుకున్న సిద్దార్థ్ పేరు చెప్పగానే బొమ్మరిల్లు చిత్రం గుర్తుకొస్తుంది. యూత్ ఫుల్ చిత్రాలతో సిద్ధార్థ్ యువతలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి సూపర్ హిట్ చిత్రాలు సిద్దార్థ్ కెరీర్ లో ఉన్నాయి. 

ఇటీవల సిద్దార్థ్ కు సరైన సక్సెస్ లేదు. దీనితో బాక్సాఫీస్ రేసులో వెనుకబడిపోయాడు. వేంగంగా కూడా సినిమాల్లో నటించడం లేదు. అప్పుడప్పుడూ కొన్ని చిత్రాలు చేస్తున్నాడు అంతే. 

సిద్దార్థ్ ప్రస్తుతం టక్కర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల సిద్దార్థ్ మీడియాతో ముచ్చటించగా అతడికి ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల సిద్దార్థ్ ఎక్కువగా సోషల్ మీడియా వేదికపై రాజకీయ, సామాజిక అంశాల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీనిగురించి ప్రశ్నిస్తూ.. మీరు రాజకీయాల్లోకి రాబోతున్నారు అని మీడియా అడిగింది. ఈ ప్రశ్నకు సిద్దార్థ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 

మహేష్ హీరోయిన్ హాట్ షో.. మతిపోగొడుతున్న సొగసు!

తనలాంటి వారు రాజకీయాలకు సెట్టవ్వరని తెలిపాడు. రాజకీయాల్లో రాణించాలంటే చాలా తెలివి అవసరం. ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. నాకు నిజం మాట్లాడడం మాత్రమే తెలుసు. అందరిలా నేను కూడా సమస్యపై మాట్లాడకుండా సైలెంట్ గా ఉండొచ్చు. కానీ అలా సైలెంట్ గా ఉంటే తప్పు చేశాననే ఫీలింగ్ నాలో ఉంటుంది. అందుకే సమస్యల గురించి మాట్లాడుతుంటా అని సిద్దార్థ్ తెలిపాడు.