గబ్బర్ సింగ్ చిత్రంతో శృతి హాసన్ కెరీరే మారిపోయింది. పవన్ సరసన శృతి నటించిన ఆ చిత్రంతో ఆమె సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో మాస్ మహారాజ్ రవితేజ సరసన క్రాక్ అనే చిత్రంలో నటిస్తోంది. 

లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ ఆగిపోవడంతో సెలెబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. శృతి హాసన్ కూడా ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరువగా ఉంటోంది. తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. 

ఈ పోస్ట్ లో శృతి తనని తానే తిట్టుకుంటోంది. అందుకు కారణం ఉంది. 'నేను ఈ రోజు జిమ్ లో ఒక గంట వర్కౌట్ చేయడం తప్ప ఇంకేమీ చేయలేదు. నేనొక పనికిరాని మహిళని అంటూ శృతి హాసన్ పేర్కొంది. 

శృతి హాసన్ గత ఏడాది తన ప్రియుడు మైఖేల్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. తెలుగులో కాటమరాయుడు చిత్రం తర్వాత రెండేళ్ల పటు శృతి హాసన్ వెండి తెరకు దూరమైంది. ప్రస్తుతం శృతి హాసన్ తిరిగి హీరోయిన్ గా మారింది.