స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ తాజాగా ఓ షోలో పాల్గొంది. ఇందులో ఆమె చెప్పిన కొన్ని విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి. ఏ ఇండస్ట్రీలోనైనా.. వ్యసనాల బారిన పడితే ఇబ్బందులు తప్పవు. 'మహానటి' సావిత్రి కూడా మందుకి బానిసై తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.

అలానే శ్రుతిహాసన్ కూడా మద్యానికి బానిసై చాలా సమస్యలు ఎదుర్కొందట. ఒకానొక సమయంలో మద్యం మానలేక కెరీర్ పరంగా కూడా ఇబ్బందులు ఫేస్ చేసినట్లు  చెప్పుకొచ్చింది. ఆరోగ్యపరంగా కూడా చాలా సమస్యలు తలెత్తడంతో సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని శ్రుతి చెప్పింది.

గత ఏడాది కాలంగా మద్యానికి దూరంగా ఉంటున్నానని.. ఇక మళ్లీ దాని జోలికి పోనని చెప్పుకొచ్చింది. సాధారణంగా సినీ తారలు తమ బలహీనతలు, దురలవాట్ల గురించి బయటకి చెప్పుకోరు. మీడియాలో ఆ తరహా వార్తలు వచ్చినా కానీ పుకార్లని కొట్టిపారేస్తారు. కానీ శ్రుతిహాసన్ తనకున్న చెడ్డ అలవాటు గురించి ధైర్యంగా చెప్పి తన ప్రత్యేకత చాటుకుంది.

ఇదే ఇంటర్వ్యూలో తన బ్రేకప్, జీవితం వంటి విషయాలపై కూడా స్పందించింది. చాలా కాలం పాటు లండన్ కి చెందిన మైకేల్ అనే వ్యక్తితో డేటింగ్ చేసిన శ్రుతి అతడితో విడిపోయింది. మైకేల్ తో బంధం తనకో మంచి అనుభవాన్ని మిగిల్చిందని శ్రుతి చెప్పింది. జీవితంలో సరైన వ్యక్తి కోసం తాను ఎదురుచూస్తున్నట్లు.. తను కోరుకున్న లక్షణాలు ఉన్న వ్యక్తి ఎదురుపడితే.. వెంటనే అతడితో ప్రేమలో పడతానని.. ప్రపంచానికి అతడిని పరిచయం చేస్తానని తెలిపారు.