ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్ తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా గడుపుతోంది. తెలుగులో 'కాటమరాయుడు' సినిమా తరువాత కాస్త బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ ఆ సమయంలో లండన్ కి చెందిన మైకేల్ కోర్సలేతో డేటింగ్ చేసింది. చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.

వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . కొన్నేళ్లపాటు సహజీవనం చేసిన ఈ జంట ఈ ఏడాది ఏప్రిల్ లో ఒకరికొకరు దూరమయ్యారు. 
తాజాగా శ్రుతిహాసన్.. మంచులక్ష్మీ హోస్ట్ చేస్తోన్న ఓ రియాలిటీ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా మైకేల్ తో బ్రేకప్ వంటి విషయాలపై స్పందించింది. మైకేల్ తో బంధం తనకో మంచి అనుభవాన్ని మిగిల్చిందని చెప్పారు. 

తను చాలా అమాయకంగా ఉండడంతో.. చుట్టూ ఉన్నవాళ్లు తనపై ఆధిపత్యం చెలాయిస్తూ బాస్ లా ప్రవర్తిస్తారని చెప్పింది. తనకు ఎమోషన్స్ కూడా చాలా ఎక్కువ అని.. దీంతో తన చుట్టూ ఉండేవారు తమ ఆధీనంలో ఉంచుకోవాలని భావిస్తారని.. అయితే ఇవన్నీ కూడా తనకు మంచి అనుభవాలే మిగిల్చాయని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. జీవితంలో సరైన వ్యక్తి కోసం తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

తను కోరుకున్న లక్షణాలు ఉన్న వ్యక్తి ఎదురుపడితే.. వెంటనే అతడితో ప్రేమలో పడతానని.. ప్రపంచానికి అతడిని పరిచయం చేస్తానని తెలిపారు. ప్రేమలో పడడానికి ఎలాంటి  ఫార్ములాలు ఉండవని.. ఒకానొక సమయంలో మంచిగా అనిపించిన ఓ వ్యక్తి అదే సమయంలో చెడ్డగా కనిపిస్తాడని చెప్పుకొచ్చారు.