లోక నాయకుడు కమల్‌ హాసన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా సెల్ప్‌ ఐసోలేషన్‌ ను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే ఆయన కుటుంబం లోని ఒక్కొక్కరు ఒక్కో ఇంట్లో ఉంటున్నారు. కరోనా వైరస్‌ అవుట్ బ్రేక్‌ తరువాత ఓ మీడియా సంస్థతో మాట్లాడిన శృతిహాసన్‌ వారు ఈ పరిస్థితుల్లో సెల్ప్‌ ఐసోలేషన్‌ను ఎలా పాటిస్తున్నారో వెల్లడించింది.  ఈ సందర్భంగా ఆమె తన తండ్రి కమల్‌ హాసన్‌, అక్షర హాసన్‌ లు చెన్నైలోనే ఉన్నా వేరు వేరు ఇళ్లలో ఉంటున్నారని చెప్పింది. అలాగే తన తల్లి సారిక ముంబైలోని మరో ఇంట్లో ఉంటున్నట్టుగా తెలిపింది.

`మా కుటుంబం అంతా పూర్తి సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంది. నేను అమ్మా ముంబైలో వేరు వేరు అపార్ట్‌మెంట్లలో ఉంటున్నాం. నాన్న, చెల్లి చెన్నైలో వేరు వేరు ఇళ్లలో ఉంటున్నారు. మా అందరికి వివిధ రకాల ట్రావెలింగ్ షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. అందుకే ఇలా సపరేట్‌గా ఉంటున్నాం. ప్రజలందరూ కూడా ఇలాగే ఉండాలి ఆశిస్తున్నా` అంటూ చెప్పింది శృతి హాసన్‌.

అదే సమయంలో తన క్వారెంటైన్‌ టైం గురించి చెపుతూ `బయటకు వెళ్లే అవకాశం లేకుండా ఒకే చోట ఉండటం అనేది చాలా బాధకరమైన ఎక్స్‌పీరియన్స్‌` అని చెప్పింది. ఇటీవల దేవీ అనే షార్ట్ ఫిలింతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శృతిహాసన్‌, పలు తమిళ, తెలుగు సినిమాల్లో నటించేందుకు ఓకె చెప్పింది.