శనివారం సాయంత్రం 8 గంటల వరకు ఈ వెబ్ సైట్‌లో రూ. 200 చెల్లించి రిజిస్టర్ చేయించుకున్న వారిలో లక్కిడ్రా ద్వారా కొంత మందిని ఎంపిక చేసి వారికి వీడియో కాల్‌లో తనతో పాటు డ్యాన్స్ చేసే అవకాశం కల్పిస్తానని చెప్పింది. అంతేకాదు అలా చెల్లించిన మొత్తాన్ని నిరుపేదల సహాయార్థం వినియోగిస్తామని తెలిపింది.

కరోన వైరస్ కారణంగా ప్రపంచమంతా లాక్‌ డౌన్‌లో ఉండిపోవటంతో టాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రియ శరన్‌ స్పెయిన్‌లోనే ఉండిపోయింది. భర్తతో కలిసి అక్కడే ఉంటున్న ఈ బ్యూటీ కొద్ది రోజులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తన భర్తకు కరోనా లక్షణాలు కనిపించటంతో తీవ్రంగా భయపడిపోయిన శ్రియ తరువాత పరిస్థితులు చక్కబడటంతో భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తన వర్క్ అవుట్ వీడియోలతో పాటు భర్తతో కలిసి సరదాగా గడుపుతున్న సమయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటోంది.

అయితే అదే సమయంలో లాక్‌ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలు, నిరాశ్రయులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అందుకోసం ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వచ్చింది. విరాళాలు సేకరించేందుకు ప్లాన్ చేసింది. www.thekindnessproject.inతో కలిసి అభిమానులకు బంపర్‌ ఆఫర్ ఇచ్చింది.

శనివారం సాయంత్రం 8 గంటల వరకు ఈ వెబ్ సైట్‌లో రూ. 200 చెల్లించి రిజిస్టర్ చేయించుకున్న వారిలో లక్కిడ్రా ద్వారా కొంత మందిని ఎంపిక చేసి వారికి వీడియో కాల్‌లో తనతో పాటు డ్యాన్స్ చేసే అవకాశం కల్పిస్తానని చెప్పింది. అంతేకాదు అలా చెల్లించిన మొత్తాన్ని నిరుపేదల సహాయార్థం వినియోగిస్తామని తెలిపింది. ఈ మంచి పనిలో అందరూ భాగస్వాములు కావాలంటూ పిలుపునిచ్చింది శ్రియ.

View post on Instagram