ఒకప్పటి టాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రీయ భర్తకు కరోనా వచ్చిదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా అందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో భాగంగా తాజాగా `20 రోజుల క్రితం నా భర్త ఆండ్రేకు కరోనా లక్షణాలు కనిపించాయి. మేం హస్పిటల్‌ కు వెళ్తే అక్కడ పరీక్షించిన డాక్టర్లు కరోనా లక్షణాలు చాలా తక్కువగా ఉన్నందున టెస్ట్ లు అవసరం లేదని చెప్పారు. అయితే డాక్టర్లు అవసరం లేదని చెప్పినా మాకు మాత్రం భయం వేసింది.

మాకు ఏం చేయాలో అర్ధం కాలేదు. ఆండ్రూ అజిత్రో మైసిన్ వేసుకున్నాడు. అది సరైనా చికిత్సేనా కాదా అన్న విషయం మాకు తెలియదు. కానీ.. దేవుడి దయ వల్ల తను బాగున్నాడు. తనకి ఏమీ కాలేదు. ఆరోగ్యంగా ఉన్నాడు. మాకు నిజంగా అది కరెక్ట్ మెడిసినా కాదా అన్న విషయం కూడా తెలియదు` అంటూ ఓ డాక్టర్ తో శ్రియ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఒకప్పుడు స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసిన శ్రీయ తరువాత కొత్త తరం హీరోయిన్ల రాకతో కాస్త స్లో అయ్యింది. కేవలం సీనియర్‌ హీరోల సరసన మాత్రమే నటిస్తున్న ఈ బ్యూటీ 2018లో సీక్రెట్‌గా మ్యారేజ్‌ చేసుకుంది. రష్యాకు చెందిన వ్యాపార వేత్త ఆండ్రూ తో సుదీర్ఘ కాలం ప్రేమ తరువాత ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకుంది.