ఒకప్పుడు స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసిన శ్రియ ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తుంది. అయితే అవకాశాలు తగ్గిపోవటం కారణంగానే శ్రియ సినిమాలకు దూరమైందన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై స్పందించింది హాట్ బ్యూటీ శ్రియ. తనకు అవకాశాలు వస్తున్నాయని చెప్పిన ఈ భామ, కథలు క్యారెక్టర్స్ నచ్చకనే సినిమాలు చేయటం లేదని చెప్పింది. ముఖ్యంగా కొంత మంది దర్శకులు కథ చెప్పే సమయంలో తన క్యారెక్టర్ గురించి ఒక రకంగా చెపుతున్నారని, తరువాత సెట్స్ మీదకు వచ్చే సరికి క్యారెక్టర్ పూర్తిగా మార్చేస్తున్నారని చెప్పింది. తాను సినిమాలు తగ్గించడానికి ఇది కూడా ఓ కారణం అని తెలిపింది శ్రియ.

అదే సమయంలో స్పెషల్ సాంగ్స్ చేయటంపై కూడా ఆసక్తికరంగా స్పందించింది. తాను స్పెషల్ సాంగ్ చేయటం ప్రారంబించిన సమయంలో హీరోయిన్స్‌ ఎవరు స్పెషల్ సాంగ్స్ చేయటం లేదన్న శ్రియ. ఆ సాంప్రదాయానికి తానే నాంధి పలికినట్టుగా చెప్పింది. ఆ సమయంలో స్పెషల్ సాంగ్స్ చేస్తే హీరోయిన్ అవకాశాలు రావని హీరోయిన్స్ భయపడే వారని.. కానీ తాను భయాన్ని తొలగించానని చెప్పింది శ్రియ. తన తరువాత స్టార్ హీరోయిన్స్‌ కూడా స్పెషల్ సాంగ్స్ చేసేందుకు ముందుకు వచ్చారని చెప్పింది.

ఇక ప్రస్తుతం ఈ భామ యూరోప్‌లో భర్తతో కలిసి ఉంటుంది. కరోనా కారణంగా అక్కడ భయానక పరిస్థితులు ఎదురుకావటంతో ఆమె ఇంట్లోనే ఉంటు తన అనుభవాలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ సమయంలో తన భర్తకు కరోనా లక్షణాలు రావటంతో శ్రియ తీవ్ర ఆవేదనకు లోనైంది. అయితే ప్రస్తుతం శ్రియ భర్త ఆరోగ్య కుదుట పడింది. అయితే అక్కడ కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండటంతో ఇళ్లు కదిలే పరిస్థితి లేదు. దీంతో సోషల్ మీడియా ద్వారా తరుచూ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతుంది శ్రియ.