అందాల తార శ్రీయ శరన్ ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. టాలీవుడ్ లో మాత్రమే కాదు.. సౌత్ ఇండియాలో అగ్ర హీరోలందరితో శ్రీయ ఆడిపాడింది. శ్రీయ ఎన్నో ఘనవిజయం సాధించిన చిత్రాలలో నటించింది. కొంటె చూపుతో కుర్రాళ్లని ఆకర్షించే హీరోయిన్ గా శ్రీయ గుర్తింపు పొందింది. 

శ్రీయ శరన్ వయసు ప్రస్తుతం 37 ఏళ్లు. గత ఏడాదే శ్రీయ తాన్ రష్యన్ ప్రియుడిని వివాహం చేసుకుంది. ఎక్కువకాలం హీరోయిన్ గా రాణించడం, వయసు మీదపడుతుండడంతో సహజంగానే శ్రీయకు అవకాశాలు తగ్గుతున్నాయి. కానీ తనలో అందం, చలాకీతనం ఏమాత్రం తగ్గలేదని శ్రీయ సోషల్ మీడియా ద్వారా చెప్పకనే చెబుతోంది. 

తన గ్లామరస్ ఫొటోస్ ని షేర్ చేస్తోంది. తాజాగా శ్రీయ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో శ్రీయ చేస్తున్న బెల్లీ డాన్స్ మతిపోగోట్టే విధంగా ఉంది. శ్రీయ డాన్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. శ్రీయ ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. 

శ్రీయ చివరగా తెలుగులో వీరభోగ వసంతరాయులు, పైసావసూల్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం కొన్ని తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ఇష్టం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీయ దాదాపు ఒకటిన్నర దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్స్ అందరితో నటించింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Just like that

A post shared by Shriya Saran (@shriya_saran1109) on Dec 14, 2019 at 12:32pm PST