త్రివిక్రమ్, బన్నీ క్రేజీ కాంబోలో తెరక్కుతున్న చిత్రం అల.. వైకుంఠపురములో. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. తన తదుపరి చిత్రాల విషయంలో కూడా బన్నీ జాగ్రత్తలు వహిస్తున్నాడు. చాలా రోజుల క్రితం సుకుమార్, బన్నీ కాంబోలో హ్యాట్రిక్ మూవీ ఖరారైంది. కానీ ఇంతవరకు ఫైనల్ స్క్రిప్ట్ రెడీ కాలేదని సమాచారం. కథ విషయంలో అల్లు అర్జున్ అంతలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

ఈ ఏడాది బన్నీ ఓకే చేసిన మరో ఆసక్తికర ప్రాజెక్ట్ 'ఐకాన్'. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు.త్రివిక్రమ్, సుకుమార్ చిత్రాల తర్వాత ఐకాన్ ప్రారంభం అవుతుందని అంతా భావించారు. ఈ చిత్ర ప్రాథమిక కథని బన్నీ ఓకే చేశాడు. కానీ ఇటీవల దర్శకుడు ఫైనల్ వర్షన్ నెరేట్ చేయగా అల్లు అర్జున్ కు నచ్చలేదని వార్తలు వస్తున్నాయి. 

ఈ చిత్ర కథ మోటార్ బైక్ చుట్టూ తిరుగుతుందని వార్తలు వచ్చాయి. ఫిక్షనల్ మూవీ 'మోటార్ సైకిల్ డైరీస్' కథ ఆధారంగా ఐకాన్ కథని రూపొందించినట్లు తెలుస్తోంది. ఐకాన్ కథ బన్నీకి నచ్చక పోవడంతో ఇక ఈ ప్రాజెక్ట్ ఇప్పటిలో ఉండే అవకాశం కనిపించడం లేదు. 

బన్నీకి తగ్గట్లుగా వేణు శ్రీరామ్ కథలో మార్పులు చేస్తాడా లేక వేరే కథతో అప్రోచ్ అవుతాడా అనేది వేచి చూడాలి.