టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR రిలీజ్ అయ్యే వరకు సినిమాకు సంబంధించిన రూమర్స్ తగ్గేలా లేవు. చిత్ర యూనిట్ కూడా ప్రతి రూమర్ పై స్పందించకుండా సైలెంట్ గా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో పడింది. రీసెంట్ గా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా నటిస్తున్న అలియా భట్ సినిమా నుంచి తప్పుకున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి.

వాటిపై చిత్ర యూనిట్ ఇది వరకే ఒక క్లారిటీ ఇచ్చింది. ఆమె సినిమా నుంచి తప్పుకోవడం లేదని తెలియజేశారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఎప్రిల్ లో అలియా భట్ కి సంబంధించిన సీన్స్ ని పూర్తి చేయాలని జక్కన్న టార్గెట్ గా పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు అలియా డేట్స్ ని అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పడుతోంది. సంజయ్ లీలా భన్సాలి గంగూభాయ్ సినిమా ఎండింగ్ దశలో ఉండగా మరొక సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోంది.

కరోనా కారణంగా చేయాల్సిన పనులు పూర్తి కాలేదు. అలియా షూటింగ్ క్యాన్సిల్ కావడం వలన ఆ ఎఫెక్ట్ ఇప్పుడు RRR షూటింగ్ పై పడుతోంది. ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఇంకా ఎక్కువ సమయాన్ని తీసుకొని వచ్చే ఏడాది జనవరికి సినిమాను షిఫ్ట్ చేసిన రాజమౌళికి అలియా వ్యవహారం సందిగ్ధంలో పడేసింది. మరి ఆయన ఏ విధంగా అడుగులు వేస్తారు అనేది చూడాలి. అయితే అలియాను పాత్ర విషయంలో మాత్రం దర్శకుడు ఎలాంటి మార్పులు చేయడానికి ఇష్టపడటం లేదట.