Asianet News TeluguAsianet News Telugu

#Animal షాకింగ్ ప్రైస్ కు తెలుగు రైట్స్ ,రిస్క్ చేస్తున్నారా?

ఈ సినిమా  తెలుగు రైట్స్ మంచి డిమాండ్ ఏర్పడింది.  తెలుగు రైట్స్ ని భారీ మొత్తానికి  దిల్ రాజు సొంతం చేసుకున్నారు.
 

Shocking Price for Animal Telugu Rights jsp
Author
First Published Nov 25, 2023, 9:26 AM IST

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా డైరెక్షన్‌లో తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘యానిమల్‌’. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు.  బాలీవుడ్ టా ప్ ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫుల్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్.  ఈ ట్రైలర్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. ఇదే సమయంలో ఈ దర్శకుడు తెలుగు వాడు కావటంతో ఇక్కడ కూడా భారీ రిలీజ్ అవనుంది. ఈ క్రమంలో తెలుగు రైట్స్ మంచి డిమాండ్ ఏర్పడినట్లు సమాచారం.  తెలుగు రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు.

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం తెలుగు రైట్స్ నిమిత్తం 15 కోట్లు దిల్ రాజు చెల్లించటానికి ఎగ్రిమెంట్ చేసుకున్నారని వినికిడి. ఇది ఓ హిందీ డబ్బింగ్ సినిమాకు అదీ పెద్దగా ఇక్కడ పాపులారిటి లేని హీరోకు బాగా ఎక్కువే. అయితే కంటెంట్ మీదా , దర్శకుడు సందీప్ వంగా మీద ఉన్న నమ్మకంతో ఈ రైట్స్ తీసుకున్నారని చెప్తున్నారు.  ట్రైలర్ చూస్తే తండ్రీ, కొడుకుల మధ్య ఎమోషనల్‌గా కథగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే ఫుల్ యాక్షన్‌ సీన్స్ ఉండడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌తో ఈ మూవీపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్‌ కూడా పూర్తయింది. ఈ మూవీకి  ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు.  ఈ మూవీ రన్‌టైమ్‌ చూస్తే భారీ నిడివితోనే వస్తోంది. ఏకంగా మూడు గంటల 21 నిమిషాల పాటు ఉందని డైరెక్టర్ సందీప్ రెడ్డి వెల్లడించారు. 

  యానిమల్‌ సినిమా తండ్రీకొడుకుల రిలేషన్‌ షిప్‌ నేపథ్యంలో ఉండబోతుందట. అర్జున్ రెడ్డిలో లవ్‌ స్టోరీతో దుమ్ము రేపిన సందీప్ రెడ్డి.. ఈసారి తండ్రి కొడుకుల బాండింగ్‌ను మరింత పవర్ ఫుల్‌గా చూపించబోతున్నాడట. యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్ తండ్రి పాత్రలో అనిల్‌ కపూర్ నటిస్తున్నాడు. బాబీ డియోల్‌ కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడు.  పవర్‌ ఫుల్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌, తండ్రి కొడుకు మధ్య ఎమోషన్.. పీక్స్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇలాంటి సబ్జెక్ట్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై చూడని విధంగా యానిమల్ ఉంటుందట. దాంతో యానిమల్ పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మూవీ పక్కా రివెంజ్ స్టొరీ అని తెలుస్తుంది.  యానిమల్‌ చిత్రాన్ని భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని నిర్మిస్తున్నారు.  టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios