Asianet News TeluguAsianet News Telugu

“చూసీ చూడంగానే” ట్రైలర్.. రొమాంటిక్ లవ్ స్టోరీ

`పెళ్ళిచూపులు`, `మెంటల్ మదిలో`లను నిర్మించిన నిర్మాత రాజ్ కందుకూరి. ఆయన తన కుమారుడు  శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శేష సింధురావు దర్శకత్వంలో  `చూసీ చూడంగానే` అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Shiva Kandukuri 's Choosi Choodangaane Trailer
Author
Hyderabad, First Published Dec 4, 2019, 7:50 AM IST

ఫిలిమ్‌ఫేర్, జాతీయ అవార్డులను దక్కించుకుని తెలుగు సినిమాల ఘనతను చాటిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు `పెళ్ళిచూపులు`, `మెంటల్ మదిలో`లను నిర్మించిన నిర్మాత రాజ్ కందుకూరి. ఆయన తన కుమారుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శేష సింధురావు దర్శకత్వంలో `చూసీ చూడంగానే` అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ లో శివ కందుకూరి సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. రాజ్ కందుకూరి గ‌త చిత్రాల్లాగానే ఈ చిత్రం కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ అసోసియేష‌న్‌లో రిలీజ్ అవుతోంది. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి `మెంట‌ల్ మ‌దిలో` కెమెరా మెన్ వేద రామ‌న్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.

డిసెంబర్ నెలలొ చివరి వారంలొ ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు.  ఈ చిత్రం చాలా రిఫ్రెష్ గా ,కొత్తగా ఉంది. ఓ టీనేజ్ కుర్రాడి లైఫ్ లో జరిగే ఎమోషనల్ అండ్ లవ్ ఇన్సిడెంట్స్ ను ఎలివేట్ చేస్తూ ట్రైలర్ సాగింది. ట్రైలర్ కాలేజీ లైఫ్ నుంచీ జాబ్, సెటిల్ వరకూ ఇలా ఒక కుర్రాడి లైఫ్ లోని అన్ని అంశాలను కవర్ చేస్తూ ట్రైలర్ కట్ చేసారు.

Follow Us:
Download App:
  • android
  • ios