బిగ్ బాస్ 3లో మహిళల్లో శ్రీముఖి మాత్రమే ఫైనల్ కు చేరుకుంది. మిగిలిన వారంతా ఎలిమినేట్ అయ్యారు. ఈ సీజన్ లో శ్రీముఖి, శివజ్యోతి, హిమజ, రోహిణి, అషు రెడ్డి కంటెస్టెంట్స్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. శివజ్యోతి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగానే తన హౌస్ మేట్స్ ని కలుసుకుంది. 

హిమజ, రోహిణి, అషు లతో కలసి దీపావళి పండగని సెలెబ్రేట్ చేసుకుంది. వీళ్లంతా టపాకాయలు కాల్చుతూ దీపావళిని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఆ దృశ్యాల్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. వీళ్ళ సెలెబ్రేషన్స్ లో మంచోడు రవికృష్ణ కూడా జాయిన్ అయ్యాడు. 

తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది. శివజ్యోతి ప్రతి చిన్న విషయానికి ఎమోటినల్ అవుతూ కంటతడి పెట్టుకుంటూ బిగ్ బాస్ హౌస్ లో కనిపించేది. ఆమె ఏడుపుపై హౌస్ మేట్స్ కూడా జోకులు వేసేవాళ్ళు. 

శివజ్యోతి టాస్క్ లలో కూడా చురుగ్గా పాల్గొంది. తన శక్తి మేరకు బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఇక శ్రీముఖి కెరీర్ విషయానికి వస్తే ఓ ప్రముఖ ఛానల్ లో యాకర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. బిత్తిరి సత్తితో కలసి ఆమె చేసే కార్యక్రమానికి మంచి ఆదరణ లభించింది.