ఇటీవల వైద్యులపై జరుగుతున్న దాడులను వ్యతిరేఖిస్తూ `జీతేగా.. ఇండియా జీతేంగే హమ్‌` అనే నినాదంతో ఓ క్యాంపెయిన్‌ను  ప్రారంభించింది నటి రవీనా టండన్‌. ఈ క్యాంపెయిన్‌ను కొనసాగించాల్సిందిగా శిల్పాను కోరింది రవీనా. 

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతోంది. కరోనా దాదాపు అన్ని దేశాల్లో విజృంభిస్తుండగా అంతకన్నా ఎక్కువగా ఫేక్‌ వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ వార్తలపై సీనియర్ నటి, బాలీవుడ్ భామ శిల్పా శెట్టి ఫైర్ అయ్యింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా శిల్పా అభిమానులకు కొన్ని సూచనలు చేసింది. వీడియో మెసేజ్‌ రూపంలొ ఇచ్చిన ఈ సందేశంలో డాక్టర్లపై, వైధ్య సిబ్బందిపై జరిగిన దాడులను ఆమె ఖండించింది.

ఇటీవల వైద్యులపై జరుగుతున్న దాడులను వ్యతిరేఖిస్తూ `జీతేగా.. ఇండియా జీతేంగే హమ్‌` అనే నినాదంతో ఓ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్‌ను కొనసాగించాల్సిందిగా శిల్పాను కోరింది రవీనా. `మానవత్వాన్ని చాటడానికి మనం చేయగలిగేది ఒక్కటే.. ఈ భయానక సమయం నుంచి మనల్ని కాపాడటానికి తమ ప్రాణాలను సైతం లేక్కచేయకుండ కష్టపడుతున్న వారి కోసం మన గొంతు కలపడం మాత్రమే` అంటూ తన సందేశాన్నిచ్చింది రవీనా.

ఈ సందేశంపై స్పందించిన శిల్ప.. `ఈ ప్రయత్నంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్స్‌. సమాజాన్ని కాపాడటం కోసం అందరు కలిసి కష్టపడాలి. ఈ కష్టకాలంలో మన కోసం పనిచేస్తున్న వారికి మద్ధతు ఇవ్వండి. అలాగే ఈ విపత్కర సమయంలో ఫేక్‌ వార్తలు ప్రచారం చేయటం మానేయండి. ఈ మహమ్మారిపై మనమంతా ఒక్కటిగా పోరాడాల్సిన సమయం ఇది` అంటూ వీడియో మెసేజ్‌ రిలీజ్‌ చేసింది. తనతో పాటు స్పందించాల్సిందిగా నటి సోనాలి కులకర్ణి, నిర్మాత ఓనిర్‌ లను కోరింది శిల్ప.

View post on Instagram