Asianet News TeluguAsianet News Telugu

స్టేజ్ పైనే శ్రద్దా దాస్ తో.. శేఖర్ మాస్టర్ రొమాన్స్.. మాస్టార్ మామూలోడు కాదుగా..

ఈమధ్య రొమాంటిక్ పెర్ఫామెన్స్ లు ఎక్కువగా ఇస్తున్నారు.. స్టార్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్. స్టేజ్ పైనే డాన్స్ తో పాటు కాస్త రొమాంటిక్ టచ్  కూడా ఇస్తున్నారు. 

Shekar Master Dance Performance with Shraddha das In Dhee Show jms
Author
First Published Apr 29, 2023, 8:28 AM IST

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్నారు. అటు సినిమాలు.. ఇటు డాన్స్ షోస్ కు జడ్జిగా తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. అంతే కాదు తాజాగా ఆయన డైరెక్టర్ గా కూడా మారిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఎన్ని అవతారాలు ఎత్తినా.. శేఖర్ మాస్టర్ లో చిలిపిదనం మాత్రం పోలేదు. స్టేజ్ పై డాన్స్ చేస్తూనే.. రొమాంటిక్ టచ్ లు ఇస్తుున్నాడు మాస్టార్. ఢీ  స్టేజ్ మీదే.. డాన్స్ తో పాటు.. తన టాలెంట్ కూడా చూపిస్తున్నాడు శేఖర్ మాస్టర్. 

తాజాగా మరోసారి  ఢీ స్టేజ్ పై  టాలెంట్ చూపించాడు స్టార్ కొరియోగ్రఫర్. ఢీ షో ద్వారానే డాన్స్ మాస్టర్ గా.. పరిచయం అయ్యారు శేఖర్. టైటిల్ కొట్టిన తరువాత స్వయంకృషితో.. టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రఫర్ గా ఎదిగాడు. తానుఎదిగిన ఢీ షోకే జడ్జిగా చేస్తున్నారు. ఢీలో ప్రతీ సీజన్ కు ఎవరో ఒక హీరోయిన్ జడ్జిగా శేఖర్ మాస్టర్ తో ఆడ్ అయ్యి.. షోకుకలరింగ్ అందిస్తున్నారు. వచ్చిన ప్రతీ హీరోయిన్ తో ఏదో ఒక సందర్భంలో.. డాన్స్ చేస్తూ.. రొమాన్స్ చేస్తున్నారు శేఖర్ మాస్టరా్.  

ఓవైపు సినిమాలు చేస్తూనే.. ఢీ షోకు జడ్జిగా మారి.. అటు  హీరోయిన్స్ తో డ్యాన్సులు వేస్తూ.. రొమాన్స్ లు చేస్తూ..  రచ్చ రచ్చ చేస్తున్నాడు. తాజాగా ఢీలో కో జడ్జిగా ఉన్న  శ్రద్ధా దాస్ తో శేఖర్ మాస్టార్ చేసిన రొమాంటిక్ పెర్ఫామెన్స్  ప్రస్తుతం వైరల్ అవుతోంది.అప్పట్లో సదాతో కలిసి  డ్యాన్స్ చేస్తూ.. సందడి చేసిన  శేఖర్ మాస్టార్.. ఆ తర్వాత ప్రియమణి, పూర్ణలలతో కూడా ఇలాగే రెచ్చిపోయారు. ఇక తాజాగా శ్రద్దాతోకలిసి చిందేశారు అది కూడా తాను కొరియోగ్రఫీ చేసిన.. కళావతి పాటకు అరిపోయే డాన్స చేసి చూపించాడు. 

శ్రద్దాతో కలిసి డాన్స్ చేయడమే కాదు.. కాస్తో కూస్తో.. రొమాన్స్ కూడా చేశాడు. హగ్స్, ఎత్తుకోవడం, దగ్గరకు తీసుకోవడం లాంటివి చేస్తూ రచ్చ చేశాడు.తాజాగా రిలీజ్ అయిన  ఢీ ప్రోమో లో వీరి డాన్స్ పార్ట్ హైలెట్ అవుతోంది. ఇప్పటికే  క్వార్టర్ ఫైనల్స్  వరకు వచ్చిన ఢీషో.. ఇంకాస్త స్పైసీగా తయారవుతోంది.   ఇక ఈ వీడియో నెటిజన్లను తెగ ఎంటర్టేన్ చేస్తుంది. సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios