Asianet News TeluguAsianet News Telugu
breaking news image

సోనాక్షి పెళ్లి అయిన రెండు రోజులకే హాస్పటిల్ లో చేరిన శత్రుఘ్న సిన్హా

పెళ్లి అయిన రెండు రోజుల తర్వాత శత్రుఘ్న సిన్హా ఆసుపత్రిలో చేరడం చూసి అభిమానులు షాక్ అయ్యారు. 

Shatrughan Sinha Hospitalised Days After Daughter Sonakshi Wedding JSP
Author
First Published Jul 1, 2024, 7:15 AM IST


ప్రముఖ బాలీవుడ్‌ నటుడు శత్రుఘ్న సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హాకు ఐదు రోజుల క్రితమే వివాహం అయ్యింది.  ప్రస్తుతం సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉన్న బ్యూటీ.. తాజాగా పెళ్లి పీటలు ఎక్కింది.  లవర్ ని వివాహం చేసుకుని.. వైవాహిక బంధంలోకి ప్రవేశించింది. నటుడు జహీర్ ఇక్బాల్‏తో గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న సోనాక్షి.. జూన్ 23న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. అయితే అనుకోని విధంగా పెళ్లైన కొద్ది రోజులకే ఆమె తండ్రి శతృఘ్న సిన్హా హాస్పటిల్ లో జాయిన్ అయ్యారు. 

ఈ పెళ్లికి సోనాక్షి సిన్హా తండ్రి శత్రుఘ్న సిన్హా ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను శత్రుఘ్న సిన్హా తోసిపుచ్చారు. తన కూతురు పెళ్లిలో ఆనందంగా పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.  పెళ్లి అయిన రెండు రోజుల తర్వాత శత్రుఘ్న సిన్హా ఆసుపత్రిలో చేరడం చూసి అభిమానులు షాక్ అయ్యారు. సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ ఆసుపత్రికి వెళ్లి శతృఘ్న సిన్హా ఆరోగ్యంపై ఆరా తీశారు.

బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, శత్రుఘ్న సిన్హా ఇంట్లో సోఫాలో కూర్చున్నారు. అక్కడి నుంచి లేస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఆ సందర్భంలో ఆయన పక్కటెముకకు గాయమైంది. ఈ ఘటన జరిగినప్పుడు సోనాక్షి సిన్హా కూడా ఇంట్లోనే ఉన్నారు. దీంతో ఆయన  వెంటనే ఆస్పత్రికి తరలించారు. అభిమానులు ఆందోళన చెందవద్దని సూచించారు. శత్రుఘ్న సిన్హా కు జ్వరంతో పాటు నీరసంగా ఉన్నట్లు సమాచారం.

మరో ప్రక్క సోనాక్షి సిన్హా వేరే మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు శత్రుఘ్న సిన్హా కలత చెంది ఉండవచ్చని కొందరు ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన అస్వస్థతకు గురయ్యారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వివాహానికి ముందు శతృఘ్నసిన్హా (Shatrughan Sinha)మాట్లాడుతూ... ‘‘ఇది నా ఒక్కగానొక్క కుమార్తె జీవితం. ఆమె అంటే నాకు అమితమైన ప్రేమ. నేనే తన బలం అని ఆమె చెప్పింది. తప్పకుండా ఆ పెళ్లికి వెళ్తాను.’’ అంటూ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. శతృఘ్న తన కుమార్తె వివాహానికి వెళ్లరంటూ వచ్చిన వార్తలను ఖండించారు. ‘‘వారికి నా పాపులర్ డైలాగ్ ఖామోష్‌తో సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. ఇది మీకు సంబంధం లేని విషయం. మీ పని మీరు చూసుకోండి’’ అంటూ ఘాటుగా బదులిచ్చారు.

అలాగే సోనాక్షి వివాహం గురించిన వార్తలపై గతంలో ఆయన స్పందిస్తూ.. ‘‘సోనాక్షి వివాహం చేసుకోనుందని ప్రచారం జరుగుతోంది. కానీ, దాని గురించి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయం మీడియాకు కూడా తెలుసని.. మీ కూతురి వివాహం గురించి మీకు తెలియదా అని చాలామంది నన్ను అడిగారు. నిజంగా నాకు ఈ విషయం గురించి తెలియదు. ఎందుకంటే సోనాక్షి  నాకేమీ చెప్పలేదు. ఒకవేళ నా కూతురి వివాహం జరిగితే.. బారాత్‌ ముందు డాన్స్‌ చేయడానికి రెడీగా ఉన్నా’’ అని సిన్హా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అయితే  సోనాక్షి వివాహానికి ఆమె ఇద్దరు సోదరులు దూరంగా ఉండడం.. అంతకు ముందు ఆమె తండ్రి చేసిన కామెంట్స్ నెట్టింట చర్చకు దారి తీశాయి. అంతేకాక ఈమె మతం మారబోతుంది అంటూ జోరుగా ప్రచారం సాగింది. కానీ వాటన్నింటికి చెక్‌ పెడుతూ.. రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుని.. విమర్శలకు చెక్‌ పెట్టింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios