Asianet News TeluguAsianet News Telugu

శర్వా కు మనశ్సాంతి లేకుండా చేస్తున్నారా,డైరక్టర్ దే తప్పా?

 శ్రీరామ్ దర్శకత్వంలో ఏ హీరో సినిమా ఒప్పుకోవటం కష్టైమైన సమయంలో శర్వా అతడితో సినిమాను ఓకే చేసి షాక్ ఇచ్చాడు. త్వరలో వీరి కాంబో లో ఒక లవ్  యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోంది అని తెలుస్తోంది

Sharwanand  Sriram Aditya movie goes over budget? jsp
Author
First Published Jul 24, 2023, 9:36 AM IST


ప్రతీ నటుడుకి ఓ పర్టిక్యులర్ మార్కెట్ ఉంటుంది. ట్రైలర్స్, టీజర్స్ వంటి  ప్రమోషన్స్ తో ఆ మార్కెట్ ని అధిగమించాలని నిర్మాతలు ప్రతీ సారి ప్రయత్నిస్తూంటారు. అయితే ఎంత ప్రయత్నించినా కొంతవరకే.. ఆ లిమిటేషన్ అనేది ఎప్పుడూ కళ్లకు కనపడుతూనే ఉంటుంది. ఈ విషయం ఎప్పుడూ సీనియర్స్ చెప్తూంటారు. అయితే హీరోలకు అంతకు ముందు తమ సినిమా కలెక్ట్ చేసిన దాన్ని మించి నిర్మాత పెట్టాలని, లావిష్ గా తమ సినిమాని నిర్మాత చేయాలని కోరిక ఉంటుంది. డైరక్టర్స్ అందుకు సహకరిస్తూంటారు. ఫామ్ లో, క్రేజ్ లో ఉన్న హీరో కు అయితే అది పెద్ద విషయం కాదు. నిర్మాతలు ఇష్టమున్నా లేకపోయనా పెడుతూంటారు. అయితే పెద్దగా సక్సెస్ లేనప్పుడే ఇవన్నీ బయిటకు వస్తూంటాయి. తాజాగా శర్వానంద్ సినిమా ఓవర్ బడ్జెట్ విషయమై అంతటా డిస్కషన్ గా మారింది. 
 
ఓ ప్రక్కన  తన కెరీర్ దెబ్బ తింటున్న సమయంలో కూడా ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడంలో శర్వానంద్ తర్వాతే ఎవరైనా అని చెప్తూంటారు.  శర్వానంద్ భాక్సాఫీస్ దగ్గర గత కొంతకాలంగా ఫ్లాఫ్ లను ఎదురుకంటున్నారు. అయినా "నేను శైలజ" తర్వాత ఒక హిట్టు కూడా లేని కిషోర్ తిరుమలతో "ఆడవాళ్లు మీకు జోహార్లు" సినిమా చేశాడు శర్వానంద్. కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. డిజాస్టర్ గానే నిలిచింది. ఆ తర్వాత శ్రీ కార్తిక్ అనే కొత్త డైరెక్టర్ తో "ఓకే ఒక జీవితం" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన శర్వానంద్ ఓకే అనిపించుకునే  అందుకున్నాడు. అయితే ఈ సినిమా విడుదల కాకముందే శర్వానంద్  పెద్దగా సక్సెస్ లేని డైరెక్టర్ తో సినిమాని లైన్లో పెట్టారు.  

 డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో శర్వానంద్ ఒక సినిమా చేస్తున్నారు. "భలే మంచి రోజు" వంటి హిట్ సినిమా ఇచ్చిన శ్రీరామ్ తర్వాత వరుసగా శమంతకమణి, దేవదాసు,  వంటి ఫ్లాప్ సినిమాలు , హీరో లాంటి డిజాస్టర్ అందించాడు. ఈ టైమ్ లో శ్రీరామ్ దర్శకత్వంలో ఏ హీరో సినిమా ఒప్పుకోవటం కష్టైమైన సమయంలో శర్వా అతడితో సినిమాను ఓకే చేసి షాక్ ఇచ్చాడు. త్వరలో వీరి కాంబో లో ఒక లవ్  యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోంది అని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం  ఇప్పుడు బడ్జెట్ కంట్రోలు తప్పిందని సమాచారం. 

30 కోట్లు బడ్జెట్ చెప్పి ఒప్పించి పట్టాలు ఎక్కించిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య... దాన్ని 35 దాటించి నలభై కోట్లలోకి లాక్కెళ్తున్నాడని..ఇంకాలండన్,స్కాట్ లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో షూటింగ్ పెండింగ్ ఉందని సమాచారం. అంటే మరో పది అవుతుందని టోటల్ గా నలైభై ఐదు నుంచి యాభై దాకా అవుతుందని చెప్తున్నారు. మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం జరగకుండా ఫెరఫెక్షన్ అంటూ రోజులు పెంచుకుంటూ పోయాడని వినికిడి. శర్వా ఈ విషయమై ఆందోళనగా ఉన్నాడని, తన సినిమా మార్కెట్ మించి ఖర్చు పెడితే లోటు బడ్జెట్ తో రిలీజ్ చేయాల్సి వస్తుందని, అది తన కెరీర్ కే దెబ్బ అని వాపోతున్నారట.
 


 

Follow Us:
Download App:
  • android
  • ios