2020లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోల లిస్ట్ పెద్దగానే ఉంది. అందులో శర్వానంద్ కూడా ఉన్నాడు. ఈ యువ హీరో గతకొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. శతమానం భవతి - మహానుభావుడు వంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న శర్వా ఇటీవల రణరంగం సినిమాతో ఊహించని డిజాస్టర్ ఎదుర్కొన్నాడు.

రణరంగం కంటే ముందు చేసిన 'పడి పడి లేచే మనసు' కూడా శర్వా కెరీర్ లోనే భారీ నష్టాలను మిగిల్చింది. ఇక నెక్స్ట్ సినిమాలతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని శర్వా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ 96రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇకపోతే రీసెంట్ గా RX దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన కథకు శర్వా గ్రీన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. గత ఏడాది నుంచి అజయ్ భూపతి శర్వాతో సినిమా చేయడానికి చాలా రకాల వార్తలు వస్తున్నాయి. ఇక ఫైనల్ గా సెకండ్ సిట్టింగ్ లో అజయ్ చెప్పిన కథకు శర్వా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.  ఇకపోతే కొత్త దర్శకుడు కిషోర్ రెడ్డితో కూడా శర్వా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను చేస్తున్నాడు.

అయితే ఈ కథలో శర్వానంద్ ఒక రైతుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ కథాంశంతో సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. సినిమాలో ఎమోషన్స్ తో పాటు మంచి సందేశం కూడా ఉంటుందని టాక్. మొత్తానికి 2020లో శర్వా డిఫరెంట్ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. మరి శర్వా ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.