Asianet News TeluguAsianet News Telugu

‘జాను’ దెబ్బ: శర్వానంద్ తీసుకున్న షాకింగ్ డెసిషన్

'దిల్' రాజుగారు  ‘96’ సినిమాకు రీమేక్ సినిమా చేద్దామని అన్నప్పుడు, తమిళ మూవీ  చూశాను. క్లాసిక్ మూవీ కదా .. చేయగలనా? అనుకున్నాను. పైగా విజయ్ సేతుపతితో పోల్చి చూసి ట్రోల్ చేస్తారేమోననే సందేహం కూడా కలిగింది. 

Sharwanand not signed any other movie
Author
Hyderabad, First Published Feb 17, 2020, 8:46 AM IST

 'దిల్' రాజుగారు  ‘96’ సినిమాకు రీమేక్ సినిమా చేద్దామని అన్నప్పుడు, తమిళ మూవీ  చూశాను. క్లాసిక్ మూవీ కదా .. చేయగలనా? అనుకున్నాను. పైగా విజయ్ సేతుపతితో పోల్చి చూసి ట్రోల్ చేస్తారేమోననే సందేహం కూడా కలిగింది. ఇక సమంతతో కలిసి నటించడం సామాన్యమైన విషయం కాదు. ఆమె స్థాయికి తగినట్టుగా చేయగలనా? అని కూడా ఆలోచించాను. ఈ విషయాలను గురించే నేను 'దిల్' రాజుగారితో మాట్లాడాను. అయితే 'నన్ను నమ్ము' అని ఆయన అన్నారు. అంతే ..చేసేసాను అని శర్వా...

ఈ సినిమాపై మొదట తనకు ఉన్న అపనమ్మకం, ఆ తర్వాత దిల్ రాజు పై పెట్టుకున్న నమ్మకం చెప్పాడు. అయితే ఇప్పుడు సీన్ సితార అయ్యింది. సినిమా యావరేజ్ రేంజ్ కూడా అనిపించుకోలేకపోయింది. అసలే ప్లాఫ్ ల్లో ఉన్న శర్వా కు ఇది మరో ప్లాప్ గా జమ అయ్యింది. ఇప్పుడేం చెయ్యాలి. హిట్ రీమేక్, పెద్ద ప్రొడక్షన్ కూడా తన కెరీర్ ని సేవ్ చేయలేకపోయాయి. ఎక్కడ తప్పు జరిగింది.

తమిళంలో క్లాసిక్ హిట్ గా నిలిచిన ‘96’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన చిత్రం ‘జాను’. శర్వానంద్.. సమంత జంటగా మాతృక దర్శకుడు ప్రేమ్ కుమారే ఈ చిత్రాన్ని కూడా రూపొందించాడు. దిల్ రాజు నిర్మించిన ‘జాను’ మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంలో మాదిరే ఇక్కడా ఈ చిత్రం మ్యాజిక్ క్రియేట్ చేస్తే...అంచనాలు తారుమారు చేస్తూ ప్లాఫ్ అయ్యి కూర్చుంది. కలెక్షన్స్ వైజ్ గా డిజాస్టర్ దిసగా ప్రయాణం పెట్టుకుంది. దిల్ రాజు దీన్ని లైట్ తీసుకున్నా, శర్వానంద్ మాత్రం సీరియస్ గానే ఈ రిజల్ట్ ని తీసుకున్నట్లు సమాచారం.

దాంతో తాజాగా శర్వానంద్ ఏ ప్రాజెక్టు సైన్ చేయటం లేదు. ముందుగా ట్రెండ్ గమనించి, బయిట ఏ తరహా చిత్రాలు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారో పరిశీలించి, అప్పుడు సినిమా ఓకే చేద్దామని ఆగినట్లు సమాచారం. ఎందుకంటే వరసపెట్టి జానుతో కలిసి మూడు ప్లాఫ్ లు వచ్చాయి. కెరీర్ ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్దితిల్లో ఉంది.

శర్వానంద్ మెచ్యుర్డ్ పర్ఫార్మెన్స్ తో కట్టిపడేసాడు.ఒరిజినల్ వెర్షన్ లో విజయ్ సేతుపతి నటనకు ఏమాత్రం తగ్గకుండా నటించి మెప్పించాడు.ముఖ్యంగా సెకండాఫ్ లో శర్వా మంచి నటన కనబరిచాడు ఇలా ఎన్ని ఈ సినిమాలో శర్వా గురించి మీడియా చెప్పినా అవన్నీ పేక మేడలు కూలినట్లు కూలిపోయాయి. ఈ నేపధ్యంలో కేవలం నిర్మాత కోసమో, లేక రీమేక్ అనో ఓకే చేసెయ్యకుండా కథలో పట్టు ఉండేలా, అదీ న్యూ జనరేషన్ కథలు ఓకే చేయాలని డిసైడ్ అయ్యారట.

రన్ రాజా రన్ తరహా ఎంటర్టైన్మెంట్ లైన్ అయితే బాగుంటుందని శర్వా భావిస్తున్నారట. అలాగని మరీ ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలు తనకు సెట్ కావు కాబట్టి లైటర్ వీన్ లో నడిచే సినిమాలు చేయాలని , లవ్ స్టోరీ లు కొద్ది కాలం గ్యాప్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. దాంతో ప్రేమ కథలు పట్టుకుని శర్వా వెంటబడుతున్న దర్శకులు ..పాపం ఏం చెయ్యాలో తెలియక బిక్క మొహం వేస్తున్నారని టాక్.

Follow Us:
Download App:
  • android
  • ios