హీరో,హీరోయిన్స్ ఇద్దరూ తన స్నేహితులు అయిన భార్యా భర్తలు యాక్సిడెంట్ లో చనిపోవటంతో అనుకోకుండా...
శర్వానంద్ -కృతి శెట్టి జంటగా నటించిన 'మనమే' సినిమా జూన్ 7న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ చేస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గానే చేసారు. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ గా చెప్పబడుతున్న మనమే చిత్రానికి శ్రీరామ్ ఆదిత్యం దర్శకత్వం వహించారు. ఇటీవలే వచ్చిన ట్రైలర్ బాగుండటంతో మూవీపై ఆసక్తి పెరిగింది.
అయితే ట్రైలర్ చూసిన వారంతా ‘లైఫ్ యాజ్ వి నో ఇట్’ అనే హాలీవుడ్ సినిమా గుర్తొస్తోందని అంటున్నారు. 2010లో విడుదలై మంచి సక్సెస్ అయ్యింది. ఈ సినిమా కథేమిటంటే...హీరో,హీరోయిన్స్ ఇద్దరూ తన స్నేహితులు అయిన భార్యా భర్తలు యాక్సిడెంట్ లో చనిపోవటంతో అనుకోకుండా ఓ పాపకు గార్డియన్లుగా ఉండాల్సివస్తుంది. ఆ పాపను పెంచే క్రమంలో వీళ్లిద్దరూ ఎళా ప్రేమలో పడ్డారు. ఆ జర్నీ వీరిద్దరిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందన్నదే కథ.
ఈ సినిమా కూడా అలాంటి కథే అని చెప్పుకుంటున్నారు. అయితే సినిమా రిలీజైతే కాని అసలు విషయం తెలియదు. మనమే సినిమా సెన్సార్ కంప్లీట్ అయింది. ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఈ సినిమా రన్‍టైమ్ 2 గంటల 35 నిమిషాలు (155 నిమిషాలు) ఉండనుందని తెలుస్తోంది. కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీకి ఇది కాస్త ఎక్కువ రన్‍టైమే. సాధారణంగా ఈ జానర్లో వచ్చే చిత్రాలు ఎక్కువగా 135 నిమిషాలలోపు ఉంటాయి.
మనమే సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ఇటీవలే జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍కు శర్వానంద్ చెప్పారు. ఈ మూవీపై చాలా నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి మూవీ చూశామని అందరూ ఫీలవుతారని అన్నారు.
ఈ మూవీ రెండేళ్లు అవ్వడంపై స్పందించాడు. ఈ సినిమాను రెండేళ్ల పాటు తీయాలని అనుకోలేదని, అలా జరిగిందంతే అని చెప్పుకొచ్చాడు. గతంలోనే నేను మాటిచ్చినట్టుగా.. 150 రూపాయలు పెట్టి సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకుడుకి నేను జవాబుదారిగా ఉండాలని అనుకుంటున్నా.. ఇకపై సినిమా బాగున్నా.. బాగా లేకపోయినా నేను బాధ్యత తీసుకుంటాను.. అందుకే ఈ సినిమా టీంని చాాలా ఇబ్బంది పెట్టాను.. చాలా గొడవలు పడ్డాను అని శర్వానంద్ చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇదొక కొత్త సినిమా అవుతుందని, కొత్త డైరెక్టర్‌ను చూస్తారని అన్నాడు.
మనమే చిత్రంలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
