టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నప్పటికీ ఏ మాత్రం తడబడకుండా అదే ఫ్లోని కొనసాగిస్తున్నాడు. నెక్స్ట్ ఈ హీరో జాను సినిమాతో రాబోతున్నాడు. సమంత కథానాయికగా నటించిన ఆ సినిమా తమిళ్ మూవీ 96కి రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఆ సినిమాతో పాటు శ్రీకారం అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో శర్వా ఒక రైతుగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం మరో సినిమాను కూడా పట్టాలెక్కించేందుకు శర్వా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కిషోర్ తిరుమలతో శర్వా రీసెంట్ గా చర్చలు జరిపినట్లు సమాచారం.

 

నేను శైలజా - చిత్రలహరి వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కిషోర్ ప్రస్తుతం రామ్ తో రెడ్ అనే థ్రిల్లర్ సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ సగానికి చేరుకుంది. అయితే నెక్స్ట్ ఆ దర్శకుడు శర్వానంద్ తో ఒక సినిమా చేయాలనీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ అంశాలతో పాటు మంచి మెస్సేజ్ ఇచ్చే పాయింట్ ని రాసుకున్న దర్శకుడు ఇదివరకే కొంత మంది హీరోలకు ఆ కథను వినిపించాడట. అయితే ఫైనల్ గా ఆ కథకు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శ్రీకారం షూటింగ్ ముగిసిన అనంతరం శర్వా ఈ కొత్త ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.