బాలీవుడ్ సీనియర్ హీరో షారుక్ ఖాన్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలమవుతోంది. ఈ స్టార్ హీరో నెక్స్ట్ సినిమా ఇప్పుడు బాలీవుడ్ పెద్ద హాట్ టాపిక్ అయిపొయింది. ఎందుకంటె షారుక్ సినిమాపై బాలీవుడ్ మీడియాలో రోజుకో రూమర్ పుట్టుకొస్తుంది. ఎప్పుడు లేని విధంగా షారుక్ ఖాన్ తన నెక్స్ట్ సినిమాపై సస్పెన్స్ క్రియేట్ చేస్తుండడం దేశమంతా హాట్ టాపిక్ గా మారింది.

గత నెలలో అట్లీ దర్శకత్వంలో షారుక్ సినిమా చేయబోతున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. టైటిల్ ని కూడా అనుకున్నట్లు ప్రచారాలు జరిగాయి. కానీ ఇంకా ఆ ప్రాజెక్ట్ గురించి డైరెక్టర్ హీరో నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇక ఆ తరువాత షారుక్ రాజ్ కుమార్ హిరాణితో కూడా ఒక సినిమాను అనుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఫైనల్ గా ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ పై షారుక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగువారైనా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్స్ రాజ్ - డీకే ఇటీవల షారుక్ కి ఒక పాయింట్ చెప్పారట. అది నచ్చడంతో వెంటనే కథను డెవలప్ చేయమని షారుక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆల్ మోస్ట్ స్క్రిప్ట్ రెడీ అయినట్లు టాక్. గతంలో ఈ డైరెక్టర్స్ 'స్త్రీ' అనే సినిమా చేసి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది.  ఇక ఇప్పుడు షారుక్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయాలనీ ఈ తెలుగు వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. మరీ ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.