ఇంటర్నెట్ లో షారుక్ ఖాన్ చిన్న కుమారుడు వైరల్ గా మారాడు. ఆరేళ్ళ అబ్రామ్ నిత్యం ఎదో ఒక వార్తతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. ఫోటోగ్రాఫర్స్ ఒక్కసారిగా కారు దగ్గరికి వచ్చి ఫ్లాష్ లు ఆన్ చేసి ఫొటోస్ తీస్తుండడంతో అబ్రామ్ వారికి తప్పుకోండి అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఓ విధంగా ఫోటోగ్రాఫర్స్ అంతా షాక్ అయ్యారు.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఇటీవల యాష్ రాజ్ ఫిలిమ్స్ స్టూడియోలో రాణి ముఖర్జీ తనయ అదిరా పుట్టినరోజు వేడుక జరిగింది. వేడుకకి చాలా మంది సెలబ్రెటీలు వచ్చారు. అయితే పోట్రోగ్రాఫర్స్ అందరిని కవర్ చేస్తుండగా షారుక్ ఖాన్ తన ఫ్యామిలీతో కారులో వచ్చారు. వారిని కెమెరాలో బంధించేందుకు కెమెరామెన్స్ ఫ్లాష్ లతో ఎగబడ్డారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#AbramKhan #shahrukhkhan #ranimukerji #Srk #srkabram #Shahrukh

A post shared by Entertainment Fan Page (@facc2911) on Dec 12, 2019 at 11:05am PST

అయితే అది నచ్చని షారుక్ తనయుడు అందరికి చేయితో సైడ్ ఇవ్వండని సైగ  చేశాడు. ఆరేళ్ళ అబ్రామ్ ఇప్పుడే ఇలా ఉన్నాడు అంటే ఇంకాస్త పెద్దగా అయితే కౌంటర్ ఇవ్వకుండా ఉండలేడు.గతంలో కూడా ఒక ఈవెంట్ నుంచి ఇంటికి వెళుతుండగా ఫోటోలు తీసుకోవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Stupid media 😠! #AbRam #AbRamKhan #SRK #ShahRukhKhan

A post shared by AbRam Khan My Muffin ❤ (@abramkhan9) on Nov 18, 2018 at 12:09pm PST

ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక షారుక్ కూతురు సుహానా కూడా అపుడపుడు స్టైలిష్ డ్రెస్సులతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంటుంది. ఇటీవల ఆమె ఒక ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్ లో నటించింది. త్వరలో బిగ్ స్క్రీన్ పై మెరవనున్నట్లు టాక్ వస్తోంది.